శరీరం ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలంటే క్యాల్షియం అత్యవసరం. శరీరానికి అతి ముఖ్యమైన పోషకాల్లో క్యాల్షియం కూడా ఒకటి. బాడీలో క్యాల్షియం సరిపడా ఉంటే.. ఎముకల సమస్యలు, దంతాల సమస్య రాకుండా ఉంటాయి. క్యాల్షియం లోపం కారణంగా బాడీ పెయిన్స్, ముఖ్యంగా నడుము నొప్పి, కాళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, చేయి నొప్పులు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఎక్కువగా క్యాల్షియం అవసరం పడుతుంది. వారిలో కండరాలు, ఎముకలు బలంగా, దృఢంగా పెరగాలంటే క్యాల్షియం చాలా అవసరం. కొందరు కొందరు క్యాల్షియం లోపంతో బాధ పడుతూ ఉంటారు. ఈ లోపంతో బాధ పడుతున్నట్లు వారికి కూడా తెలీదు. మరి క్యాల్షియం లోపం ఉంటే.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తోయో ఇప్పుడు చూద్దాం.
శరీరంలో క్యాల్షియం లోపం ఉంటే పదే పదే కండరాలు అనేవి పట్టేస్తూ ఉంటాయి. కొన్ని సార్లు త్వరగా తగ్గుతాయి. మరీ ఎక్కువ కాలం కండరాల నొప్పి, పట్టేస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా వైద్యుల్ని సంప్రదించాలి. అదే విధంగా నడుము నొప్పి కూడా విపరీతంగా వస్తుంది.
క్యాల్షియం లోపం ఉన్నట్లయితే చేతి వేళ్లలో పిన్ను పెట్టి గుచ్చినట్టు నొప్పులు వస్తాయి. అలాగే స్పర్శ లేనట్లు, మొద్దు బారిపోయినట్టు అనిపిస్తుంది. రక్త ప్రసరణ సరిగా లేకపోయినా ఇలాగే ఉంటుంది. కాబట్టి ఎక్కువ కాలం ఈ సమస్యతో బాధపడుతూ ఉంటే వెంటనే చికిత్స తీసుకోవాలి.
క్యాల్షియం లోపం ఉన్నా కూడా రక్త పోటు అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి వెంటనే పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. అదే విధంగా సడెన్‌గా బరువు తగ్గి.. సన్నగా మారినా కూడా క్యాల్షియం లోపం ఉన్నట్లే.
చిన్ని దెబ్బలకు కూడా ఎముకలు విరిగిపోవడం, బెణకడం వంటి సమస్యలు ఉన్నా కూడా క్యాల్షియం లోపంతో బాధ పడుతున్నారని అర్థం. చేతి, కాలి గోళ్లు తరచూ విరిగిపోతూ ఉన్నా కూడా క్యాల్షియం లోపం ఉన్నట్టే. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. ఈ లక్షణాలు మీలో కూడా కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం ముఖ్యం.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.