వాస్తు శాస్త్రం.. మనలో చాలా మంది దీనిని విశ్వసిస్తుంటారు. ముఖ్యంగా భారతీయులను, వాస్తును విడదీసి చూడలేని పరిస్థితి ఉంటుంది. ఇంటి నిర్మాణం అనే ఆలోచన మదిలోకి రాగానే మొదట చేసే పని. ఒక మంచి వాస్తు పండితుడి సలహాలు తీసుకోవడం. వాస్తుకు అనుగుణంగా ఇంటిని నిర్మించుకోవాలని నిపుణులు సైతం చెబుతుంటారు. అయితే వాస్తు అనేది కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే పరిమితం కాదని. ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువులు, ఇంటి నిర్వహణ విషయంలో కూడా ఉంటుందని పండితులు అంటున్నారు.
ముఖ్యంగా మనకు తెలిసో తెలియకో చేసే కొన్ని వాస్తు తప్పుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన అంటున్నారు. వాస్తు లోపాలు ఉంటే ఆరోగ్యం, ఆర్థికపరమైన ఇబ్బందులే ఉంటాయనే భావన చాలా మందిలో ఉంటుంది. అయితే వాస్తు లోపం ఉంటే మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలకు సైతం ఈ వాస్తు లోపాలు కారణమవుతాయని అంటున్నారు. ఇంతకీ ఎలాంటి వాస్తు లోపల కారణంగా ఇంట్లో గొడవలు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటిని ఎట్టి పరిస్థితుల్లో శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా ఇంట్లో సాలెపురుగులు గూళ్ళు పెట్టకూడదు. ఇల్లంతా సాలెపురుగులు గూళ్ళు పెడితే అది ఇంటిలో ప్రతికూల శక్తులను ఆకర్షిస్తుంది. దీంతో ఇంట్లో ఉండేవారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. తరచూ కుటుంబ సభ్యుల మధ్య గొడవలకు దారి తీస్తుందని, మనశ్శాంతి దూరమవుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు. అందుకే ఇంట్లో బూజు ఉంటే ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు.
ఇక మనలో చాలా మంది చేసే మరో ప్రధాన తప్పు ఇంట్లో అవసరం లేని పేపర్లను, రసీదులను దాచి పెట్టుకోవడం. అయితే ఇది మంచి అలవాటు కాదని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇలా అనవసరమై వస్తువులు కేవలం ఇంట్లోనే కాకుండా స్టోర్ రూమ్‌లో ఉన్నా మంచిది కాదని అంటున్నారు. వీటివల్ల నెగిటివ్ ఎనర్జీ పెరిగే అవకావం ఉంటుందని అంటున్నారు. అదే విధంగా మెట్లకింద వస్తువులను చిందరవందరగా పడేయడం, కిచెన్ లో పాడైపోయిన వస్తువులను పెట్టుకోవడం, విరిగిన పాత్రల్లో భోజనం చేయడం వంటివి కూడా నెగిటివ్‌కు దారి తీస్తాయని అంటున్నారు.
ఇక బెడ్‌రూమ్ పైన వాటర్ ట్యాంక్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఆ గదిలో పడుకునే వారి ఆలోచనలు స్థిరంగా ఉండవని. భార్యాభర్తల మధ్య గొడవలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. నేరుగా వాటర్ ట్యాంక్ కింద అస్సలు పడుకోకూడదని సూచిస్తున్నారు.
మరిన్ని ఇంట్రెస్టింగ్ కథనాల కోసం క్లిక్ చేయండి..