చలికాలంలో రకరకాల ఆహారం తినాలని కోరుకుంటారు. ముఖ్యంగా టీతో పాటు వేడి వేడి పకోడి, బజ్జీలు, చపాతీ, పరాఠాలను తినాలని ఎక్కువ మంది కోరుకుంటారు. ఈ సీజన్‌లో పరాఠాలను తినాలనుకుంనేవారు వివిధ రకాల పరాఠాలను తినడానికి ఇష్టపడతారు. శీతాకాలంలో ముల్లంగి తక్కువ ధరకే దొరుకుతుంది.. ఈ నేపధ్యంలో ఈ సీజన్ లో దొరికే ముల్లంగితో చేసిన పరాఠాలను తినడానికి ఎక్కువ మంది ఆసక్తిని చూపిస్తారు. వీటి రుచి చాలా అద్భుతంగా ఉంటుంది.
ముల్లంగి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని .. ముఖ్యంగా చలికాలంలో ముల్లంగి తినడం ఆరోగ్యం అని డైటీషియన్ మోహిని డోంగ్రే చెబుతున్నారు. దీని ఎక్కువ మొత్తంలో విటమిన్ సి శారీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడుతుందని అన్నారు. ముల్లంగి తినడం ఆరోగ్యకరం అయితే కొంతమంది ముల్లంగి పరాఠాలు తినకూడదని నిపుణులు అంటున్నారు. ఈ రోజు ఈ ముల్లంగి పరాఠాలను ఏ వ్యక్తులు తినకూడదో తెలుసుకుందాం..
ముల్లంగి పరాఠాను జీర్ణం చేసుకోవడం అందరికీ అంత సులభం కాదు. ముఖ్యంగా ఎవరికైనా జీర్ణవ్యవస్థ సెన్సిటివ్‌గా ఉంటే ముల్లంగి పరాటాలు తినవద్దు. ముల్లంగి పరాఠాలను తినడం వల్ల జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. అపానవాయువు, గ్యాస్ సమస్యలకు దారితీస్తుంది.
థైరాయిడ్ గ్రంధి పనితీరును ప్రభావితం చేసే ముల్లంగిలో గోయిట్రోజెన్ అనే మూలకాలు కనిపిస్తాయి. హైపోథైరాయిడిజం రోగులు ముల్లంగిని తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. ఎందుకంటే ఇది థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తుంది. ఇంకా చెప్పాలంటే ముల్లంగి పరాఠాలను తినే ముందు తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి
గర్భిణీ స్త్రీలు ముల్లంగి పరాఠాను తినే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ముల్లంగిలో విటమిన్ సి, ఫైబర్, మినరల్స్ ఉన్నప్పటికీ.. ముల్లంగిని అధికంగా తినడం గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అటువంటి సందర్భాలలో మహిళలు దీనిని తినకూడదు.
అధిక రక్తపోటు ఉన్నవారు కూడా ముల్లంగి పరాఠాలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ముల్లంగి నుంచి నీరుని తీయడానికి ఉప్పును ఉపయోగిస్తారు. అప్పుడు ఎక్కువ ఉప్పు కలుపుతారు. అందువల్ల అధిక సోడియం కారణంగా రక్తపోటు పెరుగుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..