Beauty Tips: మెరిసే చర్మం కోసం ఈ 5 హోం రెమెడీస్.. తక్కువ సమయంలో ఎక్కువ నిగారింపు..

Beauty Tips: వృద్ధాప్యం లేదా చర్మం పొడిబారడం వల్ల మీ ముఖం సహజ మెరుపును కోల్పోవచ్చు. అందువల్ల మీరు చూడటానికి అంద

Beauty Tips: మెరిసే చర్మం కోసం ఈ 5 హోం రెమెడీస్.. తక్కువ సమయంలో ఎక్కువ నిగారింపు..
Skin Care
Follow us

|

Updated on: Aug 28, 2021 | 1:27 PM

Beauty Tips: వృద్ధాప్యం లేదా చర్మం పొడిబారడం వల్ల మీ ముఖం సహజ మెరుపును కోల్పోవచ్చు. అందువల్ల మీరు చూడటానికి అంద వికారంగా కనిపిస్తారు. మీరు మునుపటిలా మళ్లీ మెరవాలంటే ఇంట్లోనే చేసుకునే ఈ 5 హోం రెమిడిస్ పాటిస్తే సరిపోతుంది. పోయిన నిగారింపును మళ్లీ తీసుకురావచ్చు. తక్కువ రోజులలో మంచి ఫలితాలు పొందవచ్చు. ఆ పద్దతుల గురించి తెలుసుకుందాం.

1. నిమ్మ- తేనె ప్యాక్- ఒక నిమ్మకాయ రాసానికి కొన్ని చుక్కల తేనె కలిపి ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాలు ఆరనివ్వాలి. నిమ్మకాయ బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. తేనె చర్మాన్ని మృదువుగా చేయడానికి సహాయపడుతుంది.

2. టమోటాలు – టమోటాలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. టమోటా రసాన్ని తీసుకొని చర్మంలోని టాన్ ఉన్న ప్రదేశాలకు అప్లై చేయండి. 15 నిమిషాలు ఆరనిచ్చిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి మూడుసార్లు చేయాలి.

3. గ్రామ్ పిండి, పసుపు – ఇది చర్మం నుంచి టాన్ తొలగించడానికి సహాయపడుతుంది. రెండు చెంచాల గ్రామ్ పిండిని తీసుకోండి దానికి చిటికెడు పసుపు, కొన్ని చుక్కల నిమ్మరసం, పాలు కలపండి. చర్మానికి అప్లై చేసి ఆరిన తర్వాత చల్లటి నీటితో కడగండి. ఈ ప్యాక్ మీ చర్మాన్ని కాంతివంతం చేయడమే కాకుండా యాంటీ ఏజెంట్‌గా పనిచేస్తుంది.

4. కొబ్బరి పాలు- కొబ్బరి పాలలో ఉండే విటమిన్ సి, తేలికపాటి ఆమ్లాలు డి-టానింగ్ ఏజెంట్లుగా పనిచేస్తాయి. తాజా కొబ్బరి పాలలో కాటన్ బాల్‌ను ముంచి టాన్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. కొద్దిసేపు ఆరిన తర్వాత కడగండి.

5. తేనె-బొప్పాయి ప్యాక్- బొప్పాయిలో ఉండే పాపైన్ ఎంజైమ్ టాన్ తొలగించడానికి సహాయపడుతుంది. కొద్దిగా బొప్పాయి గుజ్జుకు తేనె కలిపి మెత్తని పేస్ట్ లా చేయండి. ముఖం ఇతర చర్మంపై పూయండి. ఆరిన తర్వాత కడగండి. మంచి నిగారింపు ఉంటుంది.

సన్‌స్క్రీన్ ఉపయోగించండి – ప్రతిరోజూ సన్‌స్క్రీన్ ఉపయోగించడం కొనసాగించండి. పీక్ అవర్‌లలో ఎండలో వెళ్లడం మానుకోండి.

Andhra Pradesh: ఏపీలో టెన్త్ రిజల్ట్స్ విషయంలో సర్కార్ కీలక నిర్ణయం.. గ్రేడ్లు, గ్రేడ్‌ పాయింట్లు రద్దు

భార్య అంటే మరి ఇంత ప్రేమా..! భార్య చితిలోకి దూకి.. పతి సహగమనం చేసిన భర్త..:Viral Video.

New Headteacher: ముగ్గురు విద్యార్థులకు టీచర్ కావలెను.. ఏడాదికి 57లక్షల జీతం, ఒక అసిస్టెంట్, ఇతర సదుపాయాలు అదనం ఎక్కడంటే

Latest Articles