Healthy Fat Foods: మీరు తినే ఆహారాల్లో ఈ గుడ్ ఫ్యాట్స్ ఉన్నాయా.. చెక్ చేసుకోండి!

|

Sep 23, 2024 | 12:40 PM

కడుపు నిండటానికి ఎన్నో ఆహారాలు ఉంటాయి. కానీ వీటిలో శరీర ఆరోగ్యానికి మేలు చేసేవి మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడున్న కాలంలో అందరూ ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ వంటి ఆహారాలనే తీసుకుంటున్నారు. కానీ వీటి వలన వచ్చే వ్యాధుల సంఖ్య కూడా రోజు రోజూ పెరుగుతూనే ఉంది. ఇలా శరీరానికి మేలు చేసే వాటిల్లో మంచి కొవ్వులు కూడా ఉంటాయి. హెల్దీ ఫ్యాట్స్ కూడా శరీరానికి చాలా అవసరం. కొలెస్ట్రాల్‌లో రెండు రకాలు ఉంటాయన్న విషయం..

Healthy Fat Foods: మీరు తినే ఆహారాల్లో ఈ గుడ్ ఫ్యాట్స్ ఉన్నాయా.. చెక్ చేసుకోండి!
Healthy Fat Foods
Follow us on

కడుపు నిండటానికి ఎన్నో ఆహారాలు ఉంటాయి. కానీ వీటిలో శరీర ఆరోగ్యానికి మేలు చేసేవి మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడున్న కాలంలో అందరూ ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ వంటి ఆహారాలనే తీసుకుంటున్నారు. కానీ వీటి వలన వచ్చే వ్యాధుల సంఖ్య కూడా రోజు రోజూ పెరుగుతూనే ఉంది. ఇలా శరీరానికి మేలు చేసే వాటిల్లో మంచి కొవ్వులు కూడా ఉంటాయి. హెల్దీ ఫ్యాట్స్ కూడా శరీరానికి చాలా అవసరం. కొలెస్ట్రాల్‌లో రెండు రకాలు ఉంటాయన్న విషయం తెలిసిందే. చెడు చేసే కొలెస్ట్రాల్ ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల.. గుండె జబ్బులు, క్యాన్సర్, థైరాయిడ్, చర్మ సమస్యలు, ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలు ఎటాక్ చేస్తాయి. కానీ మంచి కొవ్వులు ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరానికి చాలా మేలు కలుగుతుంది. అలాంటి ఫుడ్స్‌లో కొన్నింటిని ఇప్పుడు తెలుసుకుందాం.

చియా సీడ్స్:

చియా సీడ్స్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ప్రస్తుత కాలంలో వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారు. చియా సీడ్స్‌లో శరీరానికి కావాల్సిన మంచి కొవ్వులు లభిస్తాయి. ఇందులో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ మోతాదులో లభిస్తాయి. అలాగే ఫైబర్, ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, ఖనిజాలు కూడా ఉంటాయి. ఇవి గుండె వ్యాధులు రాకుండా.. శరీరం ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.

నట్స్:

నట్స్‌లో కూడా మనకు మంచి కొవ్వులు లభిస్తాయి. వీటిల్లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, మోనో అన్ శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి చర్మానికి, గుండెకి, శరీరానికి చాలా మంచిది.

ఇవి కూడా చదవండి

చేపలు:

చేపలు తినడం వల్ల కూడా మనకు గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఫ్యాటీ ఫిష్‌లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. వారంలో ఒక్కసారి తిన్నా.. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఆలివ్ ఆయిల్:

హెల్దీ ఫ్యాట్స్ లభించే వాటిల్లో ఆలివ్ ఆయిల్ కూడా ఒకటి. ఇందులో కాల్సినంత గుడ్ ఫ్యాట్స్ లభిస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఓమేగా 3 యాసిడ్స్, మోనో అన్ శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ పుష్కలంగా అందుతాయి.

అవకాడో:

హెల్తీ ఫ్యాట్స్‌కి కేరాఫ్ అడ్రెస్‌గా అవకాడో అని చెప్పొచ్చు. ఇందులో కూడా మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ లభిస్తాయి. వీటిని తింటే బ్లడ్ ప్రెషర్ నియంత్రణలో ఉంటుంది. చర్మ సమస్యలు తగ్గుతాయి. బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ కూడా కంట్రోల్ అవుతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..