AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lifestyle: మీ పిల్లలకు ఉదయాన్నే ఈ ఫుడ్‌ ఇవ్వండి.. బ్రెయిన్‌ షార్ప్‌ అవుతుంది

మెదడు ఆరోగ్యాన్ని తీసుకునే ఆహారం ప్రభావితం చేస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెదడు పనితీరును మెరుగపరిచే ఆహార పదార్థాలను డైట్‌లో భాగం చేసుకోవడం ద్వారా జ్ఞాపశకతి పెరుగుతుందని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా ఎదిగే చిన్నారుల్లో మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలని సూచిస్తుంటారు...

Lifestyle: మీ పిల్లలకు ఉదయాన్నే ఈ ఫుడ్‌ ఇవ్వండి.. బ్రెయిన్‌ షార్ప్‌ అవుతుంది
Brain Food
Narender Vaitla
|

Updated on: Mar 17, 2024 | 6:43 PM

Share

మెదడు ఆరోగ్యాన్ని తీసుకునే ఆహారం ప్రభావితం చేస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెదడు పనితీరును మెరుగపరిచే ఆహార పదార్థాలను డైట్‌లో భాగం చేసుకోవడం ద్వారా జ్ఞాపశకతి పెరుగుతుందని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా ఎదిగే చిన్నారుల్లో మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలని సూచిస్తుంటారు. ఆరోగ్యకరమైన మెదడు అభివృద్ధికి, పిల్లల ఆహారంలో కోలిన్, ఫోలేట్, అయోడిన్, ఐరన్, పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్‌లైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు, ప్రొటీన్లు, విటమిన్లు ఎ, డి, బి6, బి12, జింక్ వంటివి ఉపయోగపడతాయని చెబుతున్నారు.

* ఇక పిల్లల బ్రెయిన్‌ డెవలప్‌మెంట్‌కు సహాయపడే కొన్ని ఆహారపదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల బ్రెయిన్‌ షార్ప్‌గా మారాలంటే గుడ్లను కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలి. 8 ఏళ్ల వయసున్న పిల్లలకు రోజుకు 2 గుడ్లు ఆహారంగా ఇవ్వొచ్చని చెబుతున్నారు.

* ఇక ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా లభించే ట్యూనా, స్వోర్డ్ ఫిష్, టిలాపియా వంటి పాదరసం అధికంగా ఉండే చేపలను ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు.

* ఆకుపచ్చ కూరల్లో ఉండే ఐరన్, ఫోలేట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. చిన్నారులకు రోజులో ఒక్కసారైనా ఆకు కూరలు ఇవ్వాలని చెబుతున్నారు.

* మెదడు ఆరోగ్యాన్ని కాపాడడంలో పెరుగు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. పెరుగులోని మంచి గుణాలు జ్ఞాపకశక్తిని పెంచుతాయి. అంతే కాదు పిల్లల్లో అయోడిన్ లోపాన్ని కూడా దూరం చేస్తుంది.

* డ్రై ఫ్రూట్స్‌ కూడా మెదడు అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్లు, మినరల్స్, ఐరన్, జింక్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు మొదలైనవి పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు శక్తిని పెంచుతాయి, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి.

* పలు రకాల పప్పులను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగవుతుంది. ఇందులోని జింక్, ప్రొటీన్, ఐరన్, ఫోలేట్ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..