AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Periods: రుతుచక్రం క్రమం తప్పిందా? అయితే ఈ సూపర్ ఫుడ్స్ మీ డైట్ లో యాడ్ చేయండి చాలు..

ఈ చక్రం తప్పిపోకూడదు. 21 రోజుల కంటే తక్కువ లేదా 35 రోజుల కంటే ఎక్కువ వ్యవధిలో పీరియడ్స్ ఉండకూడదు. ఇలా వరుసగా మూడు లేదా అంతకంటే ఎక్కువ సార్లు ఈ సైకిల్ తప్పిపోతే ఆ మహిళ ఆరోగ్యం సక్రమంగా లేదన్న దానికి అది సూచిక అని నిపుణులు చెబుతున్నారు.

Periods: రుతుచక్రం క్రమం తప్పిందా? అయితే ఈ సూపర్ ఫుడ్స్ మీ డైట్ లో యాడ్ చేయండి చాలు..
Healthy Menstruation Cycle
Madhu
|

Updated on: Jan 29, 2023 | 1:41 PM

Share

పీరియడ్స్.. ప్రతి మహిళకు అనివార్యం. అది స్త్రీ ధర్మం అంటుంటారు. సాధారణంగా ప్రతి 28 రోజులకు ఇది వస్తుంటుంది. నాలుగు నుంచి ఏడు రోజులపాటు కొనసాగుతుంది. ఈ చక్రం తప్పిపోకూడదు. 21 రోజుల కంటే తక్కువ లేదా 35 రోజుల కంటే ఎక్కువ వ్యవధిలో పీరియడ్స్ ఉండకూడదు. ఇలా వరుసగా మూడు లేదా అంతకంటే ఎక్కువ సార్లు ఈ సైకిల్ తప్పిపోతే ఆ సమయంలో వచ్చే పీరియడ్స్ తీవ్రత అధికంగా ఉంటుంది. అంతేకాక క్రమం తప్పిన రుతు చక్రం ఆ మహిళ అనారోగ్యానికి కూడా సంకేతం. ఎందుకంటే ఈ పీరియడ్స్ సమయానికి రావడం లేదంటే ఆ మహిళ ఫిట్ గా లేదని అర్థం. ఈ నేపథ్యంలో ఈ రుతుచక్రాన్ని ట్రాక్ లో ఉంచుకోవడం చాలా అవసరం.

ఆహారంతో సాధ్యం..

అందుకు కొన్ని ఆహార పదార్థాలు బాగా ఉపకరిస్తాయని పోషకాహార నిపుణురాలు లోవ్‌నీత్ బాత్రా చెబుతున్నారు. తన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో ఈ మేరకు మహిళల రుతుచక్రాన్నిక్రమపరిచే ఆహారాలను పంచుకున్నారు. ఆమె ఆ పోస్ట్ లో రాస్తూ సరైన ఆహారం తినడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొడానికి అవసరమైన శక్తిని శరీరం పొందుకుంటుందన్నారు. సక్రమంగా లేని రుతు చక్రాన్ని కూడా ఇది ప్రభావితం చేస్తుందని చెప్పారు. అయితే క్రమంగా రాని పీరియడ్స్ విషయంపై నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచిస్తూనే.. కొన్ని ఫుడ్స్ తో రుతుచక్రాన్ని మెరుగు పరచుకోవడంతోపాటు గర్భం దాల్చే అవకాశాలను పెంచుకోవచ్చని వివరించారు. ఆ ఫుడ్స్ ఏంటో చూద్దాం..

ఇవి కూడా చదవండి

బొప్పాయి.. దీనిలో కెరోటిన్ ఉంటుంది, ఈస్ట్రోజెన్ స్థాయిలకు మద్దతు ఇచ్చే పోషక ఇది. ఈ పండు గర్భాశయ సంకోచానికి కూడా సహాయపడుతుంది.

క్యారమ్ సీడ్స్ (అజ్వైన్).. క్యారమ్ గింజల నీరు మీ రుతు చక్రాన్ని నియంత్రిస్తుంది. ఇది జీర్ణక్రియకు కూడా బాగా సహకరిస్తుంది. క్యారమ్ గింజలను నీటిలో మరిగించి తీసుకుంటే పీరియడ్స్ సమయంలో నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.

అలోవెరా.. క్రమరహిత రుతు చక్రం కోసం ప్రకృతి సిద్ధమైన సహజ నివారణ ఇది. అలోవెరాలో ఫోలిక్ యాసిడ్, అమైనో ఆమ్లాలు, సాలిసిలిక్ ఆమ్లం, విటమిన్లు A, C, E & B12 పుష్కలంగా ఉంటాయి. ఇది రుతుక్రమానికి కారణమయ్యే హార్మోన్లను నియంత్రిస్తుంది. ప్రతి నెలా సమయానికి పీరియడ్స్ రావడానికి సాయపడుతుంది.

దాల్చిన చెక్క.. ఇన్సులిన్ స్థాయిలు ఇతర హార్మోన్లు, రుతు చక్రంపై కూడా ప్రభావం చూపుతాయి. దాల్చినచెక్క శరీరంలోని ఈ ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఎందుకంటే ఇది గ్లూకోజ్, ఇన్సులిన్‌ను ప్రాసెస్ చేసే శరీర సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.

పైనాపిల్.. పైనాపిల్‌లో “బ్రోమెలైన్” అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది శరీరంలో ఇన్ ఫ్లేషన్ ను తగ్గిస్తుంది. సక్రమంగా రుతుక్రమం రావడానికి సహాయపడుతుంది. ఇది మీ పీరియడ్స్ని ప్రీపోన్ చేయడానికి కూడా సహాయపడుతుంది.

ఫెన్నెల్.. ఇది క్రమరహిత పీరియడ్స్ చికిత్సకు సమర్థవంతమైన మూలిక. ఇది హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. అండోత్సర్గాన్ని ప్రోత్సహిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us