Health: కొబ్బరి నీరు మంచిదని తెగ తాగుతున్నారా.? డేంజర్‌ అంటున్న నిపుణులు..

అయితే కొబ్బరి నీరు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అతిగా తీసుకుంటే మాత్రమం డేంజర్‌ అని నిపుణులు చెబుతున్నారు. మోతాదుకు మించి కొబ్బరి నీరు తాగడం వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ తప్పవని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నీరు ఎలాగో మంచిదే కదా అని ఎక్కువ తీసుకుంటే మాత్రం దుష్ప్రభావాలు తప్పవని చెబుతున్నారు. ఇంతకీ కొబ్బరి నీటిని ఎక్కువగా తీసుకుంటే కలిగే నష్టాలు...

Health: కొబ్బరి నీరు మంచిదని తెగ తాగుతున్నారా.? డేంజర్‌ అంటున్న నిపుణులు..
Coconut Water Side Effects

Updated on: Jan 14, 2024 | 10:56 PM

కొబ్బరి నీరు ఆరోగ్యానికి ఎంతలా మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో ఉంటే ఎలక్ట్రోలైట్లు, విటమిన్లు, ఖనిజాలు శరీరానిక ఎంతో మేలు చేస్తాయి. ప్రతిరోజూ కొబ్బరి నీరు తాగడం వల్ల రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుందని, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధించవచ్చని నిపుణులు చెబుతుంటారు.

అయితే కొబ్బరి నీరు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అతిగా తీసుకుంటే మాత్రమం డేంజర్‌ అని నిపుణులు చెబుతున్నారు. మోతాదుకు మించి కొబ్బరి నీరు తాగడం వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ తప్పవని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నీరు ఎలాగో మంచిదే కదా అని ఎక్కువ తీసుకుంటే మాత్రం దుష్ప్రభావాలు తప్పవని చెబుతున్నారు. ఇంతకీ కొబ్బరి నీటిని ఎక్కువగా తీసుకుంటే కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* కొబ్బరి నీరు మోతాదుకు మించి తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, ఉబ్బరం, విరేచనాలు వంటి జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి తరచుగా జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నీటిని మితంగా తీసుకోవాలని చెబుతున్నారు.

* ఇక కొందరికి కొబ్బరి నీటిని తాగడం వల్ల అలర్జీ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కొందరిలో కొబ్బరి నీరు దద్దుర్లు, దురద, వాపులకు దారితీస్తుంది.

* కొబ్బరి నీళ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. దీంతో కొబ్బరి నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల.. రక్తంలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కిడ్నీ సమస్యలతో బాధపడే వారు కొబ్బరి నీటిని మోతాదుకు మించి తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. కిడ్నీ సమస్యలతో ఇబ్బంది పడేవారు వైద్యుల సూచన మేరకే కొబ్బరి నీరును తీసుకోవాలి.

* ఇక ఇటీవల కొబ్బరి నీరు ప్యాక్‌ చేసిన బాటిల్స్‌లో అందుబాటులోకి వస్తున్నాయి. వీటిలో సహజంగానే.. ఎక్కువగా షుగర్‌ ఉంటుంది. ఇలాంటివి తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ కథనాల కోసం క్లిక్ చేయండి..