
అందంగా ఉండే ముఖంపై అక్కడక్కడ కనిపించే నల్లటి మచ్చలు ఇబ్బందికి గురి చేస్తుంటాయి. వీటి కారణంగా ముఖం అందం పాడవ్వడం ఖాయం. అయితే ముఖంపై ఇలా మచ్చలు కావడానికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. వీటిలో ప్రధానమైనవి మన జీవన విధానంలో జరిగే మార్పేనని నిపుణులు చెబుతున్నారు. తీసుకునే ఆహారం మొదలు, జీవన విధానంలో మార్పుల కారణంగా ఈ సమస్య వస్తుందని నిపుణులు అంటున్నారు. ఇంతకీ ముఖంపై నల్లటి మచ్చలు తగ్గాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
* మానసి ఆరోగ్యం కూడా చర్మంపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. నిత్యం ఒత్తిడి, టెన్షన్‌తో బాధపడేవారి చర్మంపై సైడ్ ఎఫెక్ట్ ఉంటుందని నిపుణులు అంటున్నారు. టెన్షన్, ఒత్తిడి కారణంగా శరీరంలోని హార్మోన్లలో మార్పులు జరుగుతాయి. కాబట్టి ఇది ముఖంపై నల్లటి మచ్చలకు దారి తీస్తుందని చెబుతున్నారు. అందుకే యోగా, మెడిటేషన్ వంటివి అలవాటు చేసుకోవడం ద్వారా ఈ ఒత్తిడి నుంచి బయటపడొచ్చు.
* ఇక వాతావరణంలో దుమ్ము, ధూళి, కాలుష్యంగా కారణంగా మొటిమలు సర్వసాధారణంగా మారిపోయాయి. అయితే మనలో చాలా మంది మొటిమలు రాగానే వాటిని గిల్లుతుంటారు. దీంతో మొటిమల స్థానంలో మచ్చలుగా మారుతుంటాయి. ఈ అలవాటును కూడా మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
* చర్మ సౌందర్యంపై తీసుకునే ఆహారం కూడా ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. శరీరానికి సరైన పోషణ అందకపోయినా,చెడు ఆహారాన్ని తీసుకున్నా చర్మంపై ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని అంటున్నారు. ముఖ్యంగా ఆయిల్ ఫుడ్, స్పైసీ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ముఖంపై మొటిమలు, మచ్చలు అయ్యే అవకాశం ఉంటుంది.
* చాలా మంది ఉదయమంతా బిజీబిజీగా గడిపేసి రాత్రికి అలాగే పడుకుంటారు. దీనివల్ల కూడా చర్మం దెబ్బతింటుంది. పొల్యుషన్ కారణంగా ముఖంపై చేరిన దుమ్ము,ధూళి పోవాలంటే కచ్చితంగా రాత్రి పడుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలని నిపుణులు చెబుతున్నారు.
* శరీరం డీ హైడ్రేషన్ కు గురైనా చర్మంపై నల్లటి మచ్చలు పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఆరోగ్యకరమైన చర్మం సొంతమవ్వాలంటే కచ్చితంగా ప్రతీ రోజూ సరిడ మంచి నీటిని తీసుకోవడాన్ని అలవాటుగా మార్చుకోవాలని సూచిస్తున్నారు. దీనివల్ల శరీరంలోని మలినాలు దూరమవుతాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..