Custard Apple: రుచిలో అమృతం.. లాభాలు ఘనం..

వర్షాకాలం పోయి చలికాలం వస్తుందంటే చాలు మార్కెట్లో సీతాఫలాలు సందడి చేస్తాయి. ఎక్కడ చూసినా సీతాఫలాలే కనిపిస్తాయి. రుచిలో అమృతాన్ని తలపించే సీతాఫలంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా.? ఈ సీజన్‌లో కచ్చితంగా సీతాఫలాన్ని తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ పండును తింటే...

Custard Apple: రుచిలో అమృతం.. లాభాలు ఘనం..
Custard Apple
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Oct 12, 2024 | 8:30 PM

వర్షాకాలం పోయి చలికాలం వస్తుందంటే చాలు మార్కెట్లో సీతాఫలాలు సందడి చేస్తాయి. ఎక్కడ చూసినా సీతాఫలాలే కనిపిస్తాయి. రుచిలో అమృతాన్ని తలపించే సీతాఫలంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా.? ఈ సీజన్‌లో కచ్చితంగా సీతాఫలాన్ని తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ పండును తింటే కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సీతాఫలాన్ని క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల నిత్యం యవ్వనంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సీతాఫలం ఉపయోగడుతుంది. ఇక దీర్ఘకాలిక వ్యాధులైన క్యాన్సర్‌కు చెక్‌ పెట్టడంలో కూడా సీతాఫలం ఉపయోగపడుతుంది. ఒత్తిడితో బాధపడేవారు కూడా సీతాఫలాన్ని క్రమంతప్పకుండా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

ఈ పండులో విటమిన్‌ సి, యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని నునుపుగా యవ్వనంగా ఉంచేందుకు, చర్మ కండరాలను బిగుతుగా ఉండేలా చూసేందుకు సాయపడతాయి. ఇక సీతాఫలంలోని విటమిన్‌ బి6 మూడ్‌ బూస్టర్‌గా ఉపయోగపడుతుంది. దిగులు, కుంగుబాటు, ఒత్తిడిలాంటి వాటిని దూరం చేస్తుందని నిపుణులు అంటున్నారు.

అంతేకాకుండా బీపీతో బాధపడేవారికి కూడా సీతాఫలం సహాయపడుతుంది. ఇందులోని పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు అంటున్నారు. వీటిలో 10 శాతం పొటాషియం, 6 శాతం మెగ్నీషియం ఉంటాయి. ఇవి గుండె కవాటాలను వెడల్పు చేసేందుకు తోడ్పడతాయి. దీనివల్ల అధిక రక్తపోటును నియంత్రించవచ్చు. తద్వారా గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇందులోని ఫైబర్‌ కంటెంట్ జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

మహిళల్లో ఈ సమస్యలు కనిపిస్తే జాగ్రత్త.. వెంటనే ఇలా చేయండి.!
మహిళల్లో ఈ సమస్యలు కనిపిస్తే జాగ్రత్త.. వెంటనే ఇలా చేయండి.!
మహిళలకు గుడ్ న్యూస్.! యూపీ సర్కార్ నుండి ఏపీ సర్కార్ వరకు ఫ్రీ..
మహిళలకు గుడ్ న్యూస్.! యూపీ సర్కార్ నుండి ఏపీ సర్కార్ వరకు ఫ్రీ..
ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్‌.. 20వేల మంది పైనే నివాసం.!
ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్‌.. 20వేల మంది పైనే నివాసం.!
ప్రకాశ్‌రాజ్‌పై నిర్మాత అసహనం.! రూ.కోటి నష్టంపై జస్ట్‌ ఆస్కింగ్..
ప్రకాశ్‌రాజ్‌పై నిర్మాత అసహనం.! రూ.కోటి నష్టంపై జస్ట్‌ ఆస్కింగ్..
ఒక్క లాటరీ టిక్కెట్‌తో రూ.25 కోట్లు.. ఇది కదా అదృష్టమంటే..!
ఒక్క లాటరీ టిక్కెట్‌తో రూ.25 కోట్లు.. ఇది కదా అదృష్టమంటే..!
అమ్మబాబోయ్.! ఈ విషపు ఈగలు కాలనాగు కంటే యమ డేంజర్..
అమ్మబాబోయ్.! ఈ విషపు ఈగలు కాలనాగు కంటే యమ డేంజర్..
రతన్‌ టాటాది లవ్‌ ఫెయిల్ ఆమెతోనేనా.? అందుకే పెళ్లి చేసుకోలేదా.?
రతన్‌ టాటాది లవ్‌ ఫెయిల్ ఆమెతోనేనా.? అందుకే పెళ్లి చేసుకోలేదా.?
అద్భుత సంజీవని మునగాకు.. ప్రత్యేకించి మగవాళ్ళకి స్పెషల్.!
అద్భుత సంజీవని మునగాకు.. ప్రత్యేకించి మగవాళ్ళకి స్పెషల్.!
విమానం గాల్లో ఉండగా పైలెట్ మరణం.. ఆ తర్వాత ఏం జరిగింది.?
విమానం గాల్లో ఉండగా పైలెట్ మరణం.. ఆ తర్వాత ఏం జరిగింది.?
తెల్లారి గుడికొచ్చిన పూజారి కళ్లెదుట ఊహించని సీన్..
తెల్లారి గుడికొచ్చిన పూజారి కళ్లెదుట ఊహించని సీన్..