
దాదాపు మనం చేసే ప్రతీ వంటకంలో కరివేపాకును ఉపయోగిస్తుంటాం. వంటకు రుచితో పాటు వాసనను అందించే కరివేపాకుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయితే మనలో చాలా మంది కరివేపాకును ఏదో అనవసరమైన దానిలో భావిస్తూ పక్కనపడేస్తుంటారు. అయతే కరివేపాకు తీసుకోవడం ద్వారా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే కరివేపాకు నీటిని తీసుకోవడం వల్ల మరిన్ని లాభాలు ఉంటాయని మీకు తెలుసా.? ఇంతకీ కరివేపాకును నీటిలో నానబెట్టిన తర్వాత ఆ నీటిని తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
* బరువు తగ్గాలనుకునే వారికి కరివేపాకు నీరు ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఊబకాయం సమస్య దరిచేరదని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వును తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ప్రతీ రోజూ క్రమంతప్పకుండా కరివేపాకు నీటిని తీసుకోవడం వల్ల ఇట్టే బరువు తగ్గొచ్చని చెబుతున్నారు.
* మెరుగైన జీర్ణక్రియకు కూడా కరివేపాకు నీరు ఉపయోగపడుతుంది. ఇందులో లాక్సిటివ్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా గ్యాస్, మలబద్ధకం, విరేచనాలు వంటి సమస్యలకు కరివేపాకు నీరు ఉపయోగపడుతుంది.
* కరివేపాకు నీటిని తాగడం వల్ల శరీరం నుంచి మలినాలు దూరమవుతాయి. కరివేపాకులో ఉండే యాంటీ-ఆక్సిడెంట్లు శరీరంలో ఉండే విషపూరిత అంశాలను తొలగిస్తుంది. ఇది చర్మ ఇన్ఫెక్షన్లు, చర్మ సమస్యలు, ఫ్రీ రాడికల్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
* మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కరివేపాకు నీరు ఉపయోగపడుతుంది. ప్రతీ రోజూ కరివేపాకు నీటిని తీసుకోవడం వల్ల హైపర్ టెన్షన్ తగ్గిపోతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..