Lifestyle: చియా సీడ్స్, నిమ్మరసం కలిపి తీసుకోండి.. వారంలోనే మార్పు గమనిస్తారు..

|

Jul 04, 2024 | 5:02 PM

ముఖ్యంగా చియా గింజలు, నిమ్మకాయ రసం కలిపి తయారు చేసిన డ్రింక్‌ను క్రమం తప్పకుండా ప్రతీ రోజూ తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రాత్రంతా నాన బెట్టిన చియా గింజల్లో ఉదయాన్ని కాస్త నిమ్మరసం పిండుకొని తాగాలని సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఖాళీ కడుపుతో ఈ డ్రింక్‌ను తీసుకుంటే...

Lifestyle: చియా సీడ్స్, నిమ్మరసం కలిపి తీసుకోండి.. వారంలోనే మార్పు గమనిస్తారు..
నీటిలో నానబెట్టిన చియా విత్తనాలు తీసుకోవడం వల్ల బరువు వేగంగా తగ్గొచ్చు. చాలా సేపు కడుపు నిండుగా ఉంచుతుంది. అతిగా తినే ధోరణి తగ్గుతుంది. చియా విత్తనాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులో గుండెను ఆరోగ్యంగా ఉంచే ఒక రకమైన కొవ్వు ఆమ్లం ఉంటుంది.
Follow us on

మారుతోన్న జీవన విధానం, తీసుకునే ఆహారంలో మార్పుల కారణంగా జీర్ణ సంబంధిత సమస్యల బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో చాలా మంది రకరకాల మందులను వాడుతున్నారు. ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం, మలబద్ధకం వేధించడం వంటి సమస్యలతో ఇబ్బందిపతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి వారి కోసం చియా గింజలు దివ్యౌషధంగా పనిచేస్తాయి.

ముఖ్యంగా చియా గింజలు, నిమ్మకాయ రసం కలిపి తయారు చేసిన డ్రింక్‌ను క్రమం తప్పకుండా ప్రతీ రోజూ తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రాత్రంతా నాన బెట్టిన చియా గింజల్లో ఉదయాన్ని కాస్త నిమ్మరసం పిండుకొని తాగాలని సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఖాళీ కడుపుతో ఈ డ్రింక్‌ను తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయటని చెబుతున్నారు. ఇంతకీ ఆ లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పరగడుపున ఈ డ్రింక్‌ను తీసుకుంటే డీ హైడ్రేహన్‌ సమస్యకు చెక్‌ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా నీటిని తక్కువగా తీసుకున్నా ఈ డ్రింక్‌ తాగితే శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకుంటుందని చెబుతున్నారు. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం వంటి పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇది పూర్తిగా జీరో క్యాలరీ డ్రింక్‌. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి కూడా దివ్యౌషధంగా పనిచేస్తుంది. రోజంతా ఎక్కువగా బయట తిరిగే వారు ఈ డ్రింక్‌ను తీసుకుంటే డీహైడ్రేషన్‌ బారిన పడకుండా ఉంటారు.

ఇక చియా గింజల్లో క్వెర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె జబ్బుల వంటి సమస్యలతో పోరాడడంలో సహాయపడుతుంది. ఇందులోని ఫైబర్‌ జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. అలాగే హైబీపీతో బాధడేవారికి కూడా ఈ డ్రింక్‌ సహాయపడుతుంది. ఇందులో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ కూడా ఉంటాయి. ఇందులోని ఫైబర్‌ కంటెంట్‌ వల్ల మలబద్ధకం దూరమవుతుంది. రోజూ పరగడుపు ఈ డ్రింక్‌ తీసుకుంటే సుఖ విరేచనం అవుతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..