కోడిగుడ్లు కాదు.. ఈ పిట్ట గుడ్లు తింటే ఎముకలకు ఎంతో బలం..! తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..

ప్ర‌పంచ వ్యాప్తంగా కేవ‌లం కోళ్ల‌కు చెందిన గుడ్ల‌నే కాదు, ప‌లు ఇత‌ర ప‌క్షుల‌కు చెందిన గుడ్ల‌ను కూడా తింటుంటారు. ఈ పిట్టల మాంసంతో పాటు గుడ్లను కూడా ఇష్టంగా తింటారు కొందరు నాన్‌వెజ్‌ ప్రియులు. వీటిని తిన‌డం వ‌ల్ల ఎన్నో లాభాలు క‌లుగుతాయని చెబుతున్నారు. కౌజు పిట్ట‌ల గుడ్ల‌లో పోష‌కాలు అధికంగా ఉంటాయి. ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ చూద్దాం..

కోడిగుడ్లు కాదు.. ఈ పిట్ట గుడ్లు తింటే ఎముకలకు ఎంతో బలం..! తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..
Quail Eggs

Updated on: Nov 04, 2025 | 6:35 PM

నాన్‌ వెజ్‌ ప్రియులు ఎక్కువగా చికెన్‌, మటన్‌, చేపలతో పాటు గుడ్లు కూడా తింటారు. కొందరు కోడి గుడ్లు మాత్రమే కాకుండా ఇతర పక్షుల గుడ్లను కూడా తింటారు. అలాంటి పక్షులలో కౌజు పిట్టలు కూడా ఒకటి. ఈ పిట్టల మాంసంతో పాటు గుడ్లను కూడా ఇష్టంగా తింటారు కొందరు నాన్‌వెజ్‌ ప్రియులు. వీటిని తిన‌డం వ‌ల్ల ఎన్నో లాభాలు క‌లుగుతాయని చెబుతున్నారు. కౌజు పిట్ట‌ల గుడ్ల‌లో పోష‌కాలు అధికంగా ఉంటాయి. ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ చూద్దాం..

కౌజు పిట్ట గుడ్లలో అధిక ప్రోటీన్ ఉండటం వల్ల శరీరానికి శక్తి పెరుగుతుంది. కండరాలు బలంగా మారుతాయి. ఈ గుడ్లు తింటే నాడీ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయిని పెంచి రక్తహీనతను నివారిస్తాయి. ఈ గుడ్లలో ఉండే కోలిన్ అనే పోషకం మెదడు చురుకుదనాన్ని పెంచుతుంది. ఇవి శరీరంలో ఉన్న హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించి కణాల నష్టాన్ని నివారిస్తాయి.

కౌజు పిట్టల గుడ్లలో ఉండే విటమిన్ A, సెలీనియం వంటి పోషకాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. విటమిన్ D, కాల్షియం, ఫాస్ఫరస్ అధికంగా ఉండటంతో ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కౌజు పిట్ట గుడ్లలో ఉండే ఓవోమ్యుకోయిడ్ ప్రోటీన్ యాంటీ అలర్జిక్ గుణాలను కలిగి ఉంటుంది. విటమిన్ E, ప్రోటీన్లు చర్మానికి మెరుపును తెస్తాయి, సహజ కాంతిని ఇస్తాయి. తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవ్వడంతో శరీరానికి తగిన శక్తి లభిస్తుంది. బద్దకం పోతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..