AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రతిరోజూ స్ట్రాబెర్రీలు తింటే క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఇవే..! ఆరోగ్యంతో పాటు అందానికి..

స్ట్రాబెర్రీలు ఎంత ఆకర్షణీయంగా కనిపిస్తాయో, తినడానికి కూడా అంతే రుచికరంగా ఉంటాయి. వాటి తీపి, పుల్లని రుచి చాలా మందిని ఇష్టపడేలా చేస్తుంది. ఇంకా, వాటి వాసన కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఒక అధ్యయనంలో స్ట్రాబెర్రీలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక వ్యాధులను నివారించవచ్చని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

ప్రతిరోజూ స్ట్రాబెర్రీలు తింటే క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఇవే..! ఆరోగ్యంతో పాటు అందానికి..
Strawberry
Jyothi Gadda
|

Updated on: Nov 04, 2025 | 7:00 PM

Share

స్ట్రాబెర్రీలు ఎంత ఆకర్షణీయంగా కనిపిస్తాయో, తినడానికి కూడా అంతే రుచికరంగా ఉంటాయి. స్ట్రాబెర్రీలలో ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. రోజూ స్ట్రాబెర్రీలను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. వ్యాధుల నుండి రక్షిస్తుంది. స్ట్రాబెర్రీలలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. అధిక రక్తపోటు ఉన్న వృద్ధులకు స్ట్రాబెర్రీలు తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. స్ట్రాబెర్రీలలో పొటాషియం అధికంగా ఉంటుందని, ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

స్ట్రాబెరీ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. గ్లైసెమిక్‌ సూచీ కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి, రక్తంలో చక్కెర స్థాయిలు హఠాత్తుగా పెరగనివ్వకుండా చేస్తాయి. అంతేకాదు, ఇది గుండె ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది. తద్వారా గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. రోజూ స్ట్రాబెర్రీలను తినడం వల్ల శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. దీర్ఘకాలిక మలబద్ధకానికి చికిత్స చేస్తుంది .

స్ట్రాబెరీలో విటమిన్ సి ఉంటుంది. ఇది సీజనల్ జబ్బులు రాకుండా కాపాడుతుంది. స్ట్రాబెరీలో ఉండే విటమిన్ సి, ఎలెజిక్ యాసిడ్ కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడుతుంది. దీంతో మీ చర్మం సన్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. యాంటీఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉండే ఈ పండు వృద్ధాప్యాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. దీనిని తీసుకోవడం వల్ల ముడతలు అదుపులో ఉండి, యవ్వన చర్మాన్ని ఎక్కువ కాలం కాపాడుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
ఇంట్లో దొరికే వీటితో తులసి మొక్కను పచ్చగా, గుబురుగా మార్చేయండి..
ఇంట్లో దొరికే వీటితో తులసి మొక్కను పచ్చగా, గుబురుగా మార్చేయండి..
నవరాత్రుల సమయంలో పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!
నవరాత్రుల సమయంలో పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!