Foot Care: వర్షాల్లో కాలి పాదాలు జాగ్రత్త! అశ్రద్ధ చేస్తే ఇన్‌ఫెక్షన్స్ ముప్పు.. ఇలా చేస్తే పూర్తి ఆరోగ్యం
అందుకే మీరు ఒకవేళ వర్షంలో ఎక్కువగా తిరిగే వారైతే కాళ్లను ఓ కంట కనిపెట్టుకుంటూ ఉండటం మంచిది. ఎప్పటికప్పుడు పాదాలకు తడి లేకుండా చూసుకోవడం, ఏమైనా దురద, మంట, పగుళ్లు లాంటివి వస్తున్నాయేమో చూసుకోవడం ఉత్తమం. తద్వారా మీ కాలి పాదాలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

సాధారణంగా వర్షకాలంలో జలుబు, దగ్గు, జ్వరం వంటివి వస్తుంటాయి.. పోతుంటాయి. తడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫంగల్ ఇన్‌ఫెక‌్షన్స్ కూడా వస్తుంటాయి. ముఖ్యంగా పాదాలకు ప్రమాదం పొంచి ఉంటుంది. నీటిలో అధికంగా తిరుగుతుంటారు కాబట్టి జర్మ్స్, ఫంగీ, బ్యాక్టీరియా వంటివి వాటిపై అధికంగా దాడి చేస్తాయి. అలాగే రోజూ వర్షం కారణంగా రోడ్లు ఛిద్రం అవుతాయి. రోడ్లలో నీళ్లు నిలిచిపోతుంటాయి. అటువంటి ప్రదేశాల్లో నడుస్తున్నప్పుడు పాదాలు అనారోగ్యానికి గురవుతాయి. పాదాలకు పాచి పట్టిపోయి అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఎదురువుతుంది. మంట, వాపు కూడా వస్తుంది. ఈ నేపథ్యంలో వర్షాకాలంలో పాదాలను జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. అందుకోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిపుణులు చెబుతున్న సూచనలు ఇప్పుడు చూద్దాం..
కాళ్లకు ఏమి లేకుండా నడవద్దు.. కాళ్లకు చెప్పులు లేకుండా వర్షంలో నడవడం మంచి అనుభూతిని ఇస్తుంది. కానీ అది మీ పాదాలకు హాని చేస్తుంది. పాదాలవద్ద బ్యాక్టీరియా పెరిగి ఇన్‌ఫెక‌్షన్స్‌కు కారణమవుతుంది.
పాదాలను శుభ్రం చేసుకోవాలి.. మీ కాలి పాదాలు శుభ్రంగా లేకపోతే వాటిని బాగా కడగాలి. బ్యాక్టీరియా, గ్రిమ్ వంటి పోవడానికి ఏదైనా సబ్బును వాడవచ్చు. అలాగే అధిక నాణ్యత కలిగిన ఫుట్ కేర్ ప్రోడక్ట్స్ ని వినియోగించుకోవచ్చు.
అధికంగా మాయిశ్చరైజ్ చేయొద్దు.. చర్మానికి మాయిశ్చరైజ్ మేలు చేస్తుంది. కానీ పరిమితికి మించి వినియోగిస్తే చెడు చేయొచ్చు. వర్షాకాలంలో సాధారణంగానే మాయిశ్చర్, తేమతో నిండి ఉంటుంది. ఈ సమయంలో మాయిశ్చరైజర్ వినియోగిస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
కాలిగోళ్లు శుభ్రంగా, చిన్నగా ఉండాలి.. పొడవుగా ఉండి, శుభ్రంగా లేని గోళ్లతో ఫంగల్ ఇన్‌ఫెక‌్షన్స్ వచ్చే అవకాశం ఉంది. అందుకే గోళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. చిన్నవిగా చేసుకోవాలి. అలా అని మరీ చిన్నవిగా చేసుకోకూడదు.
వర్షాకాలానికి అనుకూలమైన చెప్పులు ధరించాలి.. వర్షంలో బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా చుట్టిన బట్టతో తయారు చేసిన చెప్పులు ధరించడం మేలు. ఇది తేమను సులభంగా గ్రహించి పాదాల ఇన్‌ఫెక‌్షన్‌ను తగ్గిస్తుంది. ఒకవేళ మీరు రోజూ బూట్లు వినియోగిస్తే అవి శుభ్రంగా ఉన్నాయని నిర్ధారించుకోండి.
అందుకే మీరు ఒకవేళ వర్షంలో ఎక్కువగా తిరిగే వారైతే కాళ్లను ఓ కంట కనిపెట్టుకుంటూ ఉండటం మంచిది. ఎప్పటికప్పుడు పాదాలకు తడి లేకుండా చూసుకోవడం, ఏమైనా దురద, మంట, పగుళ్లు లాంటివి వస్తున్నాయేమో చూసుకోవడం ఉత్తమం. తద్వారా మీ కాలి పాదాలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. నిర్లక్ష్యం చేస్తే ఇన్ ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం పొంచి ఉంది. ఒకవేళ ఇన్ ఫెక్షన్ బారిన పడినా కూడా సరైన చికిత్స తీసుకోవడం ద్వారా ఉపశమనం పొందొచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..







