
షుగర్ వ్యాధి గ్రస్తులు వేసవి కాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మీరు తీసుకునే ఆహారం విషయంలో మరింత శ్రద్ధ అవసరం. వేసవి కాలంలో ఎక్కువగా అలసట, నీరసానికి గురవుతూ ఉంటారు. దీంతో అందుబాటులో ఉండే ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. కానీ ఆ తర్వాత వచ్చే ప్రమాదాన్ని మాత్రం ఆలోచించరు. డయాబెటీస్‌తో బాధ పడేవారు సమ్మర్‌లో కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు తీసుకోవాలి. వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి అదుపులో ఉంటాయి. దీంతో మీరు అలసటకు గురవ్వకుండా ఉంటారు. మరి షుగర్ పేషెంట్స్ ఏం తీసుకుంటే మంచిదో ఇప్పుడు చూద్దాం.
షుగర్ వ్యాధి ఉన్నవారు వేసవిలో ఎక్కువగా ఆకుకూరలు తీసుకోవాలి. ఇందులో క్యాలరీలు, కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. కాబట్టి రక్తంలో షుగర్ లెవల్స్ అనేవి కంట్రోల్‌లో ఉంటాయి.
టమాటా తీసుకోవడం వల్ల కూడా జీఐ లెవల్స్ తక్కువగా ఉంటాయి. ఇన్సూలిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. కాబట్టి షుగర్ లెవల్స్ పెరగవు.
డయాబెటీస్ ఉన్నవారు వేసవిలో అన్ని రకాల క్యాప్సికమ్ తినవచ్చు. వీటిల్లో కార్బోహైడ్రేట్స్, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇవి తింటే ఇన్సూలిన్ సెన్సిటివీటిని మెరుగు పరుస్తాయి. కాబట్టి డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది.
కీరదోశ కాయ తీసుకోవడం వల్ల తక్షణమే శక్తి లభిస్తుంది. ఇందులో నీటి శాతం, ఫైబర్ కంటెంట్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి షుగర్ లెవల్స్ అనేవి అదుపులో ఉంటాయి.
పుచ్చకాయలో ఉండే తీపి అనేది సహజంగా ఉంటుంది. కాబట్టి షుగర్ పేషెంట్స్ వీటిని ఎలాంటి డౌట్ లేకుండా తినొచ్చు. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అదేవిధంగా వాటర్ మిలెన్ తింటే డీ హైడ్రేషన్ కు గరి కాకుండా ఉంటారు.
బెర్రీల్లో కూడా ఫైబర్, పాలీఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి జీవక్రియను నెమ్మదిస్తాయి. కాబట్టి త్వరగా బ్లడ్ షుగర్ లెవల్స్ పెరగవు. అలాగే జుకినీ, అవకాడో, యాపిట్, జామ, సమ్మర్ స్క్రాష్, గ్రీన్ టీ వంటివి తీసుకోవడం మంచిది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..