Dry Cough Remedies: పొడి దగ్గును తగ్గించే ఎఫెక్టీవ్‌ చిట్కాలు.. బెస్ట్‌గా వర్క్ అవుతాయి..

|

Sep 27, 2024 | 2:00 PM

ప్రస్తుతం ఈ వర్షా కాలంలో సీజనల్ వ్యాధులు ఎటాక్ చేస్తూ ఉంటాయి. దగ్గు, జలుబు, జ్వరం వేధిస్తూ ఉంటాయి. అందులోనూ ఇంట్లో పిల్లలు ఉన్నారంటే మరిన్ని ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. చలి గాలులు, తినే ఆహారం, కాలుష్యం కారణంగా వివిధ రకాల ఇన్ ఫెక్షన్లతో పాటు జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలు కూడా తరచుగా వేధిస్తూ ఉంటాయి. దగ్గు ఒక్కసారి వచ్చిందంటే అంత త్వరగా తగ్గదు. మందులు వేసుకుంటున్నా రెండు వారాల వరకు దగ్గు ఉంటుంది. ఈ దగ్గు కాస్తా పొడి దగ్గుగా కూడా మారుతుంది. పొడి దగ్గు సాధారణ సమస్యే అయినా..

Dry Cough Remedies: పొడి దగ్గును తగ్గించే ఎఫెక్టీవ్‌ చిట్కాలు.. బెస్ట్‌గా వర్క్ అవుతాయి..
Dry Cough Remedies
Follow us on

ప్రస్తుతం ఈ వర్షా కాలంలో సీజనల్ వ్యాధులు ఎటాక్ చేస్తూ ఉంటాయి. దగ్గు, జలుబు, జ్వరం వేధిస్తూ ఉంటాయి. అందులోనూ ఇంట్లో పిల్లలు ఉన్నారంటే మరిన్ని ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. చలి గాలులు, తినే ఆహారం, కాలుష్యం కారణంగా వివిధ రకాల ఇన్ ఫెక్షన్లతో పాటు జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలు కూడా తరచుగా వేధిస్తూ ఉంటాయి. దగ్గు ఒక్కసారి వచ్చిందంటే అంత త్వరగా తగ్గదు. మందులు వేసుకుంటున్నా రెండు వారాల వరకు దగ్గు ఉంటుంది. ఈ దగ్గు కాస్తా పొడి దగ్గుగా కూడా మారుతుంది. పొడి దగ్గు సాధారణ సమస్యే అయినా.. లైఫ్ స్టైల్‌పై ఎఫెక్ట్ పడుతుంది. ఈ దగ్గు కారణంగా ఏమీ తినలేం. రాత్రి పూట నిద్ర కూడా సరిగా పట్టదు. గొంతు నొప్పి, ఛాతీ నొప్పి కూడా వస్తాయి. ఇలాంటి పొడి దగ్గును తగ్గించడంలో ఇప్పుడు చెప్పే చిట్కాలు ఎంతో ఎఫెక్టీవ్‌గా పని చేస్తాయి. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

పసుపు – ఆవు నెయ్యి:

పసుపులో కర్య్కుమిన్ అనే పదార్థం ఉంటుందన్న విషయం తెలిసిందే. అదే విధంగా నెయ్యిలో కూడా యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి పొడి దగ్గును తగ్గించడంలో చక్కగా పని చేస్తాయి. పొయ్యి మీద కడాయి పెట్టి ఇందులో కొద్దిగా నెయ్యి, పసుపు వేసి వేయించండి. ఇది చల్లారాక.. ఓ చిన్న డబ్బాలో వేసి స్టోర్ చేయండి. ఈ మిశ్రమాన్ని గ్లాస్ పాలలో కొద్దిగా కలిపి పిల్లలు, పెద్దలు తాగుతూ ఉంటే పొడి దగ్గు తగ్గుతుంది.

తేనె – అల్లం:

తేనె, అల్లం కాంబినేషన్‌తో కూడా పొడి దగ్గును తగ్గించుకోవచ్చు. ఇవి శరీరంలోని హానికరమైన బ్యాక్టీరియాను, ఇన్ ఫెక్షన్లను తగ్గించడంలో చాలా చక్కగా పని చేస్తుంది. పొడి దగ్గు తగ్గాలంటే.. తేనె, అల్లం రసం, తులసి ఆకుల రసాన్ని మొత్తం కలిపి.. ఉదయం, సాయంత్రం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

పిప్పలి – శొంఠి పొడి:

పొడి దగ్గును తగ్గించడంలో పిప్పలి, శొంఠి పొడి కూడా చక్కగా పని చేస్తాయి. ఈ రెండింటిని పొడి చేసి ఇందులో కొద్దిగా బెల్లం కూడా కలిపి.. ఉదయం లేదా సాయంత్రం కలిపి తీసుకుంటే పొడి దగ్గు నుంచి ఫలితం పొందవచ్చు. నేరుగా తినలేని వారు చిన్న గ్లాసు గోరు వెచ్చని నీటిలో కలిపి తీసుకున్నా చక్కగా పని చేస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..