Throat Pain: సీజన్ మారే క్రమంలో వచ్చే గొంతు నొప్పి, దగ్గును ఇలా తగ్గించుకోండి..

వర్షాకాలం సమయం ముగుస్తుంది. వచ్చే నెల నవంబర్ నుంచి చలి కాలం మొదలు కానుంది. గట్టిగా చెప్పాలంటే ఓ పది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడు ఇలా సీజన్ మారే క్రమంలో జ్వరం, జులుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అందులోనూ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే మరింత కష్టంగా ఉంటుంది. చలి కాలంలో ఎక్కువగా గొంతు నొప్పి ఎటాక్ చేస్తుంది. ఈ నొప్పి అంత త్వరగా తగ్గదు. అలా వదిలేస్తే ఇది కాస్తా..

Throat Pain: సీజన్ మారే క్రమంలో వచ్చే గొంతు నొప్పి, దగ్గును ఇలా తగ్గించుకోండి..
Throat Pain
Follow us

|

Updated on: Oct 17, 2024 | 3:35 PM

వర్షాకాలం సమయం ముగుస్తుంది. వచ్చే నెల నవంబర్ నుంచి చలి కాలం మొదలు కానుంది. గట్టిగా చెప్పాలంటే ఓ పది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడు ఇలా సీజన్ మారే క్రమంలో జ్వరం, జులుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అందులోనూ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే మరింత కష్టంగా ఉంటుంది. చలి కాలంలో ఎక్కువగా గొంతు నొప్పి ఎటాక్ చేస్తుంది. ఈ నొప్పి అంత త్వరగా తగ్గదు. అలా వదిలేస్తే ఇది కాస్తా.. ఇన్ఫెక్షన్‌లా మారిపోతుంది. దీంతో సమస్య మరింత పెద్దది అవుతుంది. అదే విధంగా మందులు వేసుకున్నా కూడా దగ్గు ఓ రెండు వారాల దాకా తగ్గదు. కాబట్టి దగ్గు, గొంతు నొప్పి వచ్చిన మొదటిలోనే మేలుకోండి. వెంటనే ఇంట్లో ఉండే ఈ రెమిడీస్ ఫాలో చేస్తే.. ఈ రెండు పరార్ అవుతాయి. ఇంట్లో రెమిడీస్ పాటించి.. ఇంకా ఉపశమనం పొందకపోతే వైద్యుల్ని కలవడం మంచిది. మరి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

నల్ల యాలకులు:

నల్ల యాలకులు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, గొంతు నొప్పిగా ఉన్నప్పుడు నల్ల యాలకుల పొడిలో కొద్దిగా తేనె కలిపి ఉదయం, సాయంత్రం చిన్న పరిమాణంలో తీసుకోండి. నల్ల యాలకులు మరిగించిన నీటిని తాగినా మంచి ఫలితం ఉంటుంది.

లవంగాలు:

దగ్గు, గొంతు నొప్పిని తగ్గించడంలో ఇవి కూడా చక్కగా పని చేస్తాయి. లవంగాలను బాగా నలిపి.. దీనికి నల్ల ఉప్పు చేర్చి నమిలి తినండి. ఇలా తినడం వల్ల గొంతులో ఉండే ఇన్ఫెక్షన్స్ త్వరగా తగ్గుతాయి. గొంతు వాపు నుంచి కూడా త్వరగా మంచి ఫలితం పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

పసుపు వాటర్:

పసుపు ఆరోగ్యానికి చాలా మంచిది. పసుపులో యాంటీ బ్యాక్టీరియాల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఇన్ఫెక్షన్స్‌ని త్వరగా తగ్గిస్తాయి. గొంతు నొప్పి, దగ్గు ఎక్కువగా వస్తున్నప్పుడు గోరు వెచ్చటి నీటిలో పసుపు కలిపి తాగుతూ ఉండాలి. అలాగే పసుపు వేసిన గోరు వెచ్చటి నీటిని గొంతు వద్ద ఓ రెండు నిమిషాలు ఉంచితే నొప్పి, దగ్గు కూడా తగ్గుతాయి. అదే విధంగా గోరు వెచ్చని నీరును తీసుకుంటూ ఉండాలి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఏపీ ఎస్‌సీఈఆర్టీలో టీచింగ్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల
ఏపీ ఎస్‌సీఈఆర్టీలో టీచింగ్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల
పాపా.. పార్వతి ఇది నువ్వేనా..!!
పాపా.. పార్వతి ఇది నువ్వేనా..!!
రామయ్య లంక నుంచి అయోధ్య ప్రయాణానికి మధ్య లింక్.. ట్వీట్ వైరల్
రామయ్య లంక నుంచి అయోధ్య ప్రయాణానికి మధ్య లింక్.. ట్వీట్ వైరల్
సీజన్ మారే క్రమంలో వచ్చే గొంతు నొప్పి, దగ్గును ఇలా తగ్గించుకోండి.
సీజన్ మారే క్రమంలో వచ్చే గొంతు నొప్పి, దగ్గును ఇలా తగ్గించుకోండి.
భారత్‌లో తలదాచుకుంటున్న మాజీ ప్రధానిపై అరెస్టు వారెంట్‌ జారీ..
భారత్‌లో తలదాచుకుంటున్న మాజీ ప్రధానిపై అరెస్టు వారెంట్‌ జారీ..
శ్రీవారిని దర్శించుకున్న రాశి.. ఇప్పుడెలా మారిపోయిందో చూశారా?
శ్రీవారిని దర్శించుకున్న రాశి.. ఇప్పుడెలా మారిపోయిందో చూశారా?
రోజుకు ఒక గుప్పెడు తిన్నా.. ఊహించలేనన్ని బెనిఫిట్స్!
రోజుకు ఒక గుప్పెడు తిన్నా.. ఊహించలేనన్ని బెనిఫిట్స్!
3,500 జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టుల భర్తీ ఈ నెల్లోనే నోటిఫికేషన్
3,500 జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టుల భర్తీ ఈ నెల్లోనే నోటిఫికేషన్
బాలయ్యతో విబేధాలపై స్పందించిన తారక్.. క్లియర్ కట్‌గా
బాలయ్యతో విబేధాలపై స్పందించిన తారక్.. క్లియర్ కట్‌గా
దీపావళి రోజున ఏ నూనేతో దీపాలను వెలిగించాలి? ఎలా దీపరాధన చేయాలంటే
దీపావళి రోజున ఏ నూనేతో దీపాలను వెలిగించాలి? ఎలా దీపరాధన చేయాలంటే