
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ సంఖ్యలు ఎక్కువవుతున్నాయి. ఓ అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నమోదవుతోన్న మొత్తం క్యాన్సర్ కేసుల్లో 30 శాతం రొమ్ము క్యాన్సర్ కేసులే అని తేలింది. ఇది కూడా ప్రాణాంతకమైన వ్యాధి. ఇతర క్యాన్సర్లతో పోలిస్తే, రొమ్ము క్యాన్సర్ లక్షణాలు చాలా ముందుగానే కనిపిస్తాయి. అందుకే రొమ్ము క్యాన్సర్‌ను త్వరగా గుర్తించి చికిత్స ప్రారంభిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* రొమ్ము ఆకారంలో మార్పులు వస్తే క్యాన్సర్ ముందస్తు లక్షణంగా భావించాలని అంటున్నారు. రొమ్ము పరిమాణం, సునితత్వంలో మార్పులు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
* ఇక అండర్ ఆర్మ్ (చంకల్లో) ప్రాంతంలో కణితులు ఏర్పడుతున్నా వెంటనే అలర్ట్ అవ్వాలి. ఈ సమస్య కనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లో విస్మరించకూడదు.
* చనుమొనల్లో అసాధారణ మార్పు కనిపించినా అది క్యాన్సర్‌కు ముందుస్తు లక్షణంగా భావించాలని అంటున్నారు. అసాధారణంగా పెరుగుతున్నట్లు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. అలాగే చనుమొనల నుంచి రక్తపు లేదా పసుపు రంగు లిక్విడ్ రావడం కూడా ప్రమాదకరంగా భావించాలని అంటున్నారు.
* రొమ్ములో సున్నితత్వం పెరిగినా వెంటనే అలర్ట్ అవ్వాలని అంటున్నారు. ముఖ్యంగా చిన్నగా టచ్ చేసినా నొప్పి ఉంటుంది. ఇలాంటి అనుభూతి కలుగుతుంటే వెంటనే వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి.
* చనుమొనల వద్ద లేదా రొమ్ము చర్మం ఎర్రగా మారినా పొడిగా మారినా అది క్యాన్సర్‌కు సంకేతంగా భావించాలని అంటున్నారు. ఏ చిన్న అనుమానం వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని అంటున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..