Bad Habits: ఈ చెడు అలవాట్లను త్వరగా వదిలించుకోకపోతే.. మీ మానసిక ఆరోగ్యం అంతే సంగతులు..

|

Oct 24, 2022 | 1:30 PM

కరోనా మహమ్మారి తర్వాత నుంచి ప్రతీ ఒక్కరిలోనూ మానసిక సమస్యలు పెరిగిపోయాయి. ఆందోళన, పనిపై శ్రద్ధ లేకపోవడం, ఒంటరిగా..

Bad Habits: ఈ చెడు అలవాట్లను త్వరగా వదిలించుకోకపోతే.. మీ మానసిక ఆరోగ్యం అంతే సంగతులు..
Follow us on

ఎలప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే.. పోషకాహారం తింటే సరిపోదు. కంటికి కావల్సినంత నిద్ర, మెంటల్ హెల్త్ స్టేబుల్‌గా ఉండటం కూడా ముఖ్యమే. ఈ కరోనా మహమ్మారి తర్వాత నుంచి ప్రతీ ఒక్కరిలోనూ మానసిక సమస్యలు పెరిగిపోయాయి. ఆందోళన, పనిపై శ్రద్ధ లేకపోవడం, ఒంటరిగా ఫీల్ అవుతున్నట్లు అనిపించడం, అకారణంగా ఎక్కడలేని ఒత్తిడి రావడం లాంటి సమస్యలను పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ అనుభవిస్తున్నారు. వీటిని ముందే గుర్తిస్తే మంచిది.. లేదంటే మానసిక ఆరోగ్యం దెబ్బతినడమే కాదు.. ఎక్కడలేని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇవన్నీ అటుంచితే.. మీ మానసిక ఆరోగ్యం సరిగ్గా లేకపోవడానికి పలు చెడు అలవాట్లు కూడా కారణం కావచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. మొబైల్ ఫోన్ వ్యసనం:  

పొద్దున్న నిద్ర లేవగానే ముందుగా చేయాల్సిన పని మీ మొబైల్ ఫోన్ చెక్ చేసుకోవడమేనని అనుకుంటున్నారా.? అయితే ఈ అలవాటు నుంచి మీరు ఎంత త్వరగా బయటపడితే.. అంత మంచిది. నేటి సాంకేతికత కారణంగా, మనం ప్రతి విషయాన్ని, సమాచారాన్ని చాలా సులభంగా పొందగలుగుతున్నాం. అయితే స్మార్ట్‌ఫోన్‌లను ఎక్కువగా వాడటం వల్ల డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఒక పరిశోధనలో తేలింది. అందుకే స్మార్ట్ ఫోన్‌లను ఎక్కువగా వాడొద్దని వైద్య నిపుణులు అంటున్నారు. ఈ ఫోన్ వ్యసనాన్ని త్వరగా వదిలించుకోవాలని హెచ్చరిస్తున్నారు. మొదట్లో మీకు కాస్త కష్టంగానే అనిపించినా.. ఏదైనా బుక్ రీడింగ్ లాంటి హాబీని అలవాటు చేసుకుంటే.. మొబైల్ ఫోన్ వ్యసనం నుంచి ఈజీగా బయటపడవచ్చు.

2. తక్కువగా నిద్రపోవడం:

మీరు ప్రతిరోజూ తగినంత నిద్రపోతున్నారా? ప్రజలు తరచుగా నిద్ర కోసం చిన్న పవర్ న్యాప్‌లను ఉపయోగిస్తారు. అలా చేయడం సరికాదు. రాత్రిపూట 8 గంటలు నిద్రపోయేవారి మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. నిద్ర తక్కువగా ఉన్నట్లయితే.. మీ శారీరక ఆరోగ్యం దెబ్బతినడమే కాదు.. అలసట, చిరాకు, ఏకాగ్రత దెబ్బతినడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. ఇటీవల కాలంలో చాలామంది అర్థరాత్రి వరకు స్మార్ట్ ఫోన్ లేదా ఇతర గాడ్జెట్‌లతో తమ సమయాన్ని గడిపేస్తూ.. సరైన సమయానికి నిద్రపోవట్లేదు. మన శరీరం ఫిట్‌గా ఉండాలంటే.. రొటీన్ డైట్‌తో పాటు మంచి నిద్ర కూడా చాలా అవసరం.

3. సాయం కోసం అడగకపోవడం:

మీరు అందరి కంటే మెరుగ్గా పని చేయగలరని భావించి, ఇతరులతో మాట్లాడటం, లేదా పనిచేయడానికి సంకోచిస్తున్నారా.? అయితే ఇలా చేయడం సరికాదు. ఒక స్టేజి వరకు మీరు జీవితంలో ఒంటరిగా కష్టపడే ఛాన్స్ ఉంటుంది.. అంతేగానీ చివరి వరకు ఇదే ప్రయాణం చేయలేరు. ఒంటరిగా కష్టపడాలని ప్రయత్నిస్తే.. మీరు మిగిలిన తలుపులు తెరవడంలో కష్టతరమవుతుంది. సింగిల్‌గా మీలో మీరే బాధలను దిగమింగుకుంటే.. మీ మానసిక ఆరోగ్యం దిగజారినట్లే..

4. . మిమ్మల్ని ఇతరులతో పోల్చుకోవడం:

మిమ్మల్ని మీరు సోషల్ మీడియాలో ఉన్న ఇతర వ్యక్తులతో పోల్చుకుంటున్నారా? ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ కథనాలను ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ఫీడ్‌లో షేర్ చేస్తున్నారు. వాళ్లను చూసి కొందరు తమతో పోల్చుకోవడం మొదలుపెడతారు. అలా చేయడం కంటే.. ముందుగా మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడం చాలా ముఖ్యం. మీ ఎదుగుదల పట్ల శ్రద్ధ వహించండి.

5. నెగిటివిటీ:

మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలనుకుంటే, మీ ఆలోచనలను నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. జీవితంలో ప్రతికూల దృక్పథం వల్ల మనసులో ప్రతికూల ఆలోచనలు వస్తాయి. ప్రతికూలత జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. జీవితం నుంచి అన్ని ఆనందాలను తుడిచిపెట్టేస్తుంది. ప్రతికూలత కారణంగా, మీలో ఒత్తిడి, భయం లాంటివి ఏర్పడతాయి.

6. సరిగ్గా కూర్చోకపోవడం:

ఈ మధ్యకాలంలో చాలామంది ల్యాప్‌టాప్ లేదా స్మార్ట్ ఫోన్‌ల ముందు ఎక్కువ సమయం గడుపుతున్నారు. దానివల్ల మీరు చేతులు ముడుచుకుని కూర్చోవాల్సి వస్తుంది. ఈ భంగిమ కారణంగా వెన్నునొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఆ నొప్పిని ఎల్లప్పుడూ అనుభవిస్తారు. తద్వారా ఒత్తిడి, డిప్రెషన్‌కు గురి కావచ్చు. అందువల్ల, శరీరాన్ని రోజుకు రెండుసార్లు సుమారు 15 నుంచి 20 నిమిషాల పాటు సాగదీయాలి.