Diabetes Care: డయాబెటిక్ పేషెంట్లకు ఈ 5 ఆహారాలు కచ్చితంగా అవసరం.. బ్లడ్‌లో షుగర్ లెవల్స్‌ని అదుపులో ఉంచుతాయట..
Diabetes Care: డయాబెటిక్ పేషెంట్స్ డైట్ విషయంలో ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇది గుండె సంబంధిత సమస్యలు, స్ట్రోక్,
Diabetes Care: డయాబెటిక్ పేషెంట్స్ డైట్ విషయంలో ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇది గుండె సంబంధిత సమస్యలు, స్ట్రోక్, మూత్రపిండాల వ్యాధులు, అంధత్వం మొదలైన వాటి ప్రమాదాన్ని పెంచుతుంది. మీ శరీరం తగినంత ఇన్సులిన్ తయారు చేయనప్పుడు దాన్ని సమర్థవంతంగా ఉపయోగించలేనప్పుడు డయాబెటిస్ వస్తుంది. మీకు డయాబెటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయితే మీ డాక్టర్ సూచించిన ఔషధాలను తీసుకోవడంతో పాటు మీ రక్తంలో చక్కెర స్థాయిలను సహజంగా నియంత్రించే ఆహారాలను కూడా మీరు తీసుకోవచ్చు. ఈ సహజ మూలికలు, సుగంధ ద్రవ్యాలు, కూరగాయలు, పండ్లు మీ శక్తి స్థాయిని నిర్వహించడానికి సహాయపడతాయి.
1. వేప- వేప ఒక పురాతన మూలిక. ఇది దంతాలు, చర్మ సమస్యల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. డి-టాక్సిఫికేషన్ వరకు ప్రతిదానికీ ప్రయోజనకరంగా ఉంటుంది. వేపలో ఫ్లేవనాయిడ్స్, గ్లైకోసైడ్స్, ట్రైటెర్పెనాయిడ్స్ అనే రసాయనాలు ఉంటాయి. ఇవి గ్లూకోజ్ అణచివేయడంలో సహాయపడతాయి. మీరు రోజుకు రెండుసార్లు పొడి రూపంలో వేపను తీసుకోవచ్చు గరిష్ట ప్రయోజనాల కోసం టీ, నీరు లేదా ఆహారంలో చేర్చుకోండి.
2. కాకరకాయ – మధుమేహ వ్యాధిగ్రస్తులకు కాకరకాయ రసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో చరాటిన్, మోమోర్డిసిన్ ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి. మీరు ఉదయం కాకరకాయ రసం తాగవచ్చు. కొద్దిగా నల్ల మిరియాలు, ఉప్పును చల్లుకుంటే బాగుంటుంది. మధుమేహాన్ని నియంత్రించడానికి ఉదయం ఒక గ్లాసు కాకరకాయ రసం తాగడం చాలా ప్రయోజనకరం.
3. అల్లం – పురాతన కాలం నుంచి ప్రతి భారతీయ వంటగదిలో అల్లం కనిపిస్తుంది. ఇది లెక్కలేనన్ని ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఇన్సులిన్ స్రావాన్ని నియంత్రించడంలో ఇది చాలా ప్రభావవంతమైనది. మీరు టీలో అల్లం వేసుకోవచ్చు. వండడానికి పచ్చిగా ఉండాలని గుర్తుంచుకోండి.
4. నేరేడు పండు – మధుమేహం ఉన్నవారికి నేరేడు ప్రయోజనకరమైన పండు. చక్కెరను నియంత్రించడానికి ఇది చాలా మంచిది. నేరేడులో జామోబోలిన్ అనే సమ్మేళనం ఉంటుంది. దీని విత్తనాలలో జాంబోలిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడుతుంది.
5. మెంతికూర – శరీరంలో గ్లూకోస్ టాలరెన్స్ మెరుగుపరచడంలో మెంతి సహాయపడుతుంది. ఇందులో కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.