Immunity Booster: రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఈ 5 ఆయుర్వేద పద్దతులు..! ఇంట్లోనే పాటించవచ్చు..

Immunity Booster: రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఈ 5 ఆయుర్వేద పద్దతులు..! ఇంట్లోనే పాటించవచ్చు..
Immunity Booster

Immunity Booster: వ్యాధులను దూరంగా ఉంచడానికి బలమైన రోగనిరోధక శక్తి కలిగి ఉండటం అవసరం. ముఖ్యంగా కరోనా సమయంలో ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. బలమైన రోగనిరోధక

uppula Raju

| Edited By: Ravi Kiran

Aug 19, 2021 | 6:50 AM

Immunity Booster: వ్యాధులను దూరంగా ఉంచడానికి బలమైన రోగనిరోధక శక్తి కలిగి ఉండటం అవసరం. ముఖ్యంగా కరోనా సమయంలో ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. బలమైన రోగనిరోధక శక్తి కోసం మీరు కొన్ని ఆయుర్వేద పద్ధతులను పాటించాలి. అందుకోసం కొన్ని రకాల మూలికలు, మసాలా దినుసులు తీసుకోవచ్చు. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.

1. పసుపు పాలు – రోజూ ఒక కప్పు పసుపు పాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతాయి. పసుపులో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇది కణాల వాపును నివారిస్తుంది. ఇందులో కర్కుమిన్ అనే గుణం ఉన్నందున మెదడుకు కూడా మంచిది. ఇది మెదడు కణాల అభివృద్ధికి దోహదం చేస్తుంది. బలమైన రోగనిరోధక శక్తి కోసం అర టీస్పూన్ పసుపు పొడిని వేడి పాలలో కలిపి తాగవచ్చు.

2. నస్య – కొన్ని చుక్కల నెయ్యి, నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెను మీ ముక్కు రంధ్రాలలో వేయడం వల్ల ఇన్ఫెక్షన్ నివారించవచ్చు. స్నానం చేయడానికి ఒక గంట ముందు ఖాళీ కడుపుతో నస్య చేయాలి. ప్రతి నాసికా రంధ్రంలో 4-5 చుక్కలు వేసుకోవాలి. నస్య అనేది ప్రాచీన పద్ధతి కానీ ఇతర దేశాలలో ప్రాచుర్యం పొందిన తర్వాత మళ్లీ వాడుకలోకి వచ్చింది. నాసికా భాగాలను క్లియర్ చేసి, ఇన్ఫెక్షన్‌ను తరిమికొట్టి రోగనిరోధక శక్తిని పెంచడానికి గొప్ప మార్గమని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

3. ఆయిల్ పుల్లింగ్ థెరపీ – బ్యాక్టీరియాను తొలగించడానికి, నోటి పరిశుభ్రతను కాపాడటానికి ఆయిల్ పుల్లింగ్ అనేది ఒక స్వదేశీ పద్ధతి. దీని ద్వారా మీ నోటి, నాసికా రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఇది శ్లేష్మ పొరను హైడ్రేట్ చేస్తుంది. బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగస్ నుంచి రక్షిస్తుంది. ఇది నోటి దుర్వాసనను తగ్గించి కావిటీస్ రాకుండా తోడ్పడుతుంది. ఆయిల్ పుల్లింగ్ కోసం నోటిలో 1 టీస్పూన్ నువ్వు లేదా కొబ్బరి నూనె తీసుకోవాలి. దీన్ని తాగవద్దు నోటిలో 2-3 నిమిషాలు ఉంచి ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది రోజుకు ఒకటి లేదా రెండుసార్లు చేయవచ్చు.

4. చ్యవన్‌ప్రాష్ వినియోగించండి – చ్యవన్‌ప్రాష్ అనేక ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఇది వైరస్‌తో పోరాడడంలో సహాయపడుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బెల్లంతో ఆమ్లా, ఇతర మూలికలను కలపడం ద్వారా ఇంట్లో తయారుచేసుకోవచ్చు. ఇది మరింత బాగా పనిచేస్తుంది. ప్రతి సీజన్‌లో కనీసం రోజుకు రెండుసార్లు తీసుకోవచ్చు. చ్యవన్‌ప్రాష్ శరీర కణాల వాపును నివారిస్తుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేయడానికి శ్వాసకోశ వ్యవస్థకు ప్రయోజనకరంగా ఉంటుంది.

5. కధ లేదా మూలికా టీ – బలమైన యాంటీ-ఆక్సిడెంట్, ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగిన వివిధ మసాలా దినుసులు అనగా తులసి, దాల్చినచెక్క, నల్ల మిరియాలతో తయారు చేసిన మూలికా టీ తాగవచ్చు. రుచి కోసం మీరు బెల్లం లేదా నిమ్మరసం కలుపుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

AP Crime News: గుంటూరు జిల్లాలో బ్యాంకు ఉద్యోగి పేరిట మహిళకు టోకరా.. లక్ష రూపాయలు అపహరించిన దుండగుడు

AP Crime News: కర్నూల్‌ జిల్లాలో ఇద్దరు దొంగల అరెస్ట్.. కోటి విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం..

AP IIIT Notification Release: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu