Heart: గుండె జబ్బు వచ్చే ముందు ఈ 5 లక్షణాలు కనిపిస్తాయి.. అస్సలు లైట్‌ తీసుకోకండి

మనిషి ప్రాణాన్ని తీసే గుండెపోటు ఎప్పుడొస్తుందో చెప్పలేని పరిస్థితి. అప్పటి వరకు ఎంతో ఉల్లాసంగా ఉన్న వ్యక్తి కూడా ఒక్కసారిగా కుప్పకూలి పోతుంటాడు. ఇటీవల ఈ సమస్య బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. యువకులు కూడా గుండెపోటుతో మరణించడం ఆందోళన కలిగిస్తోంది. మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల...

Heart: గుండె జబ్బు వచ్చే ముందు ఈ 5 లక్షణాలు కనిపిస్తాయి.. అస్సలు లైట్‌ తీసుకోకండి
అహ్మదాబాద్‌కు చెందిన డాక్టర్ ఆకాష్ షా మాట్లాడుతూ.. ఛాతీలో కాకుండా శరీరంలో ఎక్కడ గుండెపోటు నొప్పి వస్తుందో వివరించారు. ఛాతీ కాకుండా మెడ, దవడ, భుజంలలో కూడా నొప్పి ప్రారంభమవుతుంది.
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 24, 2024 | 11:06 AM

మనిషి ప్రాణాన్ని తీసే గుండెపోటు ఎప్పుడొస్తుందో చెప్పలేని పరిస్థితి. అప్పటి వరకు ఎంతో ఉల్లాసంగా ఉన్న వ్యక్తి కూడా ఒక్కసారిగా కుప్పకూలి పోతుంటాడు. ఇటీవల ఈ సమస్య బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. యువకులు కూడా గుండెపోటుతో మరణించడం ఆందోళన కలిగిస్తోంది. మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా గుండె సంబంధిత సమస్యల బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని సరఫరా చేసే గుండె పంపింగ్ సామర్థ్యం తగ్గడం వల్ల హార్ట్ ఫెయిల్‌ అవుతుంది.

అయితే గుండెపోటు వచ్చే ముందు శరీరం మనకు కొన్ని సంకేతాలను ఇస్తుంది. వీటిని త్వరగా గుర్తించగలిగితే ప్రాణాలను కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. గుండె సంబంధిత సమస్యను వెంటనే గుర్తించి సరైన చికిత్స అందిస్తే ప్రాణాలను నిలబెట్టుకోవచ్చు. ఇంతకీ గుండె సంబంధిత సమస్యలు వచ్చే ముందు శరీరంలో కనిపించే ఆ మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఏ రకమైన శ్వాస సంబంధిత సమస్య అయినా గుండె వైఫల్యానికి సంకేతం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉన్నట్లు అనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. దీర్ఘకాలంగా ఈ సమస్య కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి.

* గుండెపోటు వచ్చే ముందు కనిపించే మరో ప్రధాన లక్షణాల్లో మోకాళ్లు లేదా చీలమండలలో వాపు ఒకటని నిపుణులు చెబుతున్నారు. గుండె బలహీనంగా మారిన సమయంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయని అంటున్నారు. గుండె సరిగ్గా పని చేయని సమయంలో చీలమండలు, మోకాళ్లలో వాపు మొదలవుతుంది.

* ఏ పని చేయకపోయినా తరచూ అలసిపోవడం. నాలుగు అడుగులు వేయగానే ఆయాసం రావడం, అలసటగా ఉండడం వంటి లక్షణాలు కూడా గుండె పోటు వచ్చే ముందు కనిపించే లక్షణాల్లో ఒకటని నిపుణులు చెబుతున్నారు.

* నిరంతరమైన దగ్గు, విపరీతమైన గురక కూడా కొన్ని సందర్భాల్లో గుండె సమస్యలకు కారణం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. గుండె పనితీరు దెబ్బతిన్న సమయంలో, ఊపిరితిత్తుల్లోకి నీరు చేరడం వంటి కారణాల వల్ల ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయని అంటున్నారు. కాబట్టి పైన తెలిపిన ఏ లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించి, సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..