
భారతీయ ఆయుర్వేద వైద్యంలో ప్రతి మూలికా ప్రత్యేకమే. సాధారణంగా మొక్కలతో ఎన్నో సమస్యలను తగ్గించవచ్చనే విషయం అందరికీ తెలిసిందే. అనారోగ్యం సమస్యలను తగ్గించడంతో పాటు ఒత్తిడిని దూరం చేయడంలోనూ కొన్ని మొక్కలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలాగే రోజ్మేరీ మొక్క వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలున్నాయి. రోగ నిరోధక శక్తిని పెంచడమే జ్ఞాపకశక్తిని పెంచడం..ఒత్తిడిని దూరం చేయడంలో ఈ మొక్క ఎక్కువగా ఉపయోగపడుతుంది. రోజ్మెరీ మొక్కను గుల్మెహందీ అని కూడా పిలుస్తారు. అల్జీమర్స్, చిత్త వైకల్యం ఉన్న వారికి రోగులకు చికిత్స చేయడానికి ఆయుర్వేదంలో ఈ మొక్కను విరివిగా ఉపయోగిస్తారు. రోజ్మెరీ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పని చేస్తుంది. అలాగే ఆరోగ్య సంరక్షణలో సంభావ్య ఉపయోగాలు కలిగి ఉంటుంది. రోజ్మేరీ అనేది ఇనుము, కాల్షియం, విటమిన్లు ఏ,ీ సీ, బీ-6తో సహా ఇతర పోషకాలు ఉంటాయి. అయితే ఈ మూలికను పెద్ద మొత్తంలో వినియోగిస్తే వాంతులు, పల్మనరీ ఎడెమా వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. రోజ్మేరీ వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
(ఈ కథనంలో అందించిన సమాచారం ప్రేక్షకుల ఆసక్తిని అనుసరించి ఇచ్చింది. TV9 తెలుగు ధృవీకరించలేదు. నిపుణులను సంప్రదించిన తర్వాత మాత్రమే దీన్ని అనుసరించాల్సి ఉంటుంది.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..