
సాధారణంగా వెల్లుల్లి అనేది మసాలా వంటకాల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే దాని అధిక ఘాటు వాసన కారణంగా చాలా మంది దూరంగా ఉంటారు. వీలైనంత మేర వంటల్లో దాని వినియోగాన్ని తగ్గిస్తూ ఉంటారు. వెల్లుల్లి అనేక ఆరోగ్య ప్రయోజనాలకు కీలకం. కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడం నుంచి మధుమేహాన్ని నియంత్రించడం వరకు వెల్లుల్లి చాలా మేలు చేస్తాయి. వెల్లుల్లిని మీ రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. అలాగే మధుమేహాన్ని నియంత్రించడంతో పాటు ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయితే వెల్లుల్లిని మీ రోజువారీ ఆహారంలో ఎలా చేర్చుకోవాలి? దాని ఘాటు వాసన కారణంగా దాన్ని తినలేం కదా అని చాలా మంది చెబుతూ ఉంటారు. అయితే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న వెల్లుల్లిని రోజువారీ ఆహారంలో ఎలా చేర్చుకోవాలో? పోషకాహార నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అవేంటో ఓ సారి తెలుసుకుందాం.
పచ్చి వెల్లుల్లిని ఖాళీ కడుపుతో తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ముడి వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే సమ్మేళనం కొలెస్ట్రాల్ తగ్గించి, రక్తాన్ని సన్నగా చేసే లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. కాబట్టి ఉదయాన్నే ఒక గ్లాసు నీటితో కొన్ని పచ్చి వెల్లుల్లి రెబ్బలను తినాలని నిపుణుల సూచన. ముఖ్యంగా వెల్లుల్లిని వండితే అల్లిసిన్ పలుచన అవుతుంది. కాబట్టి పచ్చి వెల్లుల్లిని తినడమే మేలు.
వెల్లుల్లి ప్రయోజనాలను అనుభవిస్తూనే తేలికపాటి రుచిని ఇష్టపడే వారికి వెల్లుల్లి టీ ఒక అద్భుతమైన ఎంపిక. వెల్లుల్లి టీ సిద్ధం చేయడానికి ఒక వెల్లుల్లి రెబ్బను చూర్ణం చేసి, ఒక కప్పు నీటిలో కలపాలి. టీని కొన్ని నిమిషాలు కాచి ఆపై 1-2 టీస్పూన్ల దాల్చిన చెక్క జోడించాలి. ఈ మిశ్రమం చల్లార్చిన తర్వాత వెల్లుల్లి మిశ్రమాన్ని జోడించి, అనంతరం టీ స్పూన్ తేనె, అర టీస్పూన్ నిమ్మరసాన్ని జోడించాలి. ఉదయాన్నే వెల్లుల్లి టీ తాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలుంటాయి.
వెల్లుల్లిని తేనెతో కలిపి తీసుకుంటే కూడా చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఒక వెల్లుల్లి రెబ్బను మూడు నుండి నాలుగు ముక్కలుగా కోసి ఒక చెంచా మీద ఉంచాలి. అనంతరం చెంచాకి కొన్ని చుక్కల తేనె వేసి రెండు నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత వెల్లుల్లిని జాగ్రత్తగా నమిలి మింగాలి. రుచి చాలా ఘాటుగా ఉంటే మీరు దానితో పాటు కొన్ని సిప్స్ గోరువెచ్చని నీటిని తీసుకోవచ్చు ప్రతిరోజూ ఖాళీ కడుపుతో ఈ మిశ్రమాన్ని ఒక స్పూన్ తీసుకోవడం చాలా మంచిది.
మీ రోజువారీ ఆహారంలో వెల్లుల్లిని చేర్చడానికి సులభమైన మార్గాలలో ఇది ఒకటి. మీ సాధారణ భోజనంలో వెల్లుల్లిని చేరిస్తే చాలా మంచిది. ముఖ్యంగా వెల్లుల్లి లవంగాలతో కలిపి మెత్తగా నూరి చూర్ణం చేయాలి. అనంతరం మీ వంటను ప్రారంభించే ముందు నూనెలో దీన్ని వేసిన అనంతరం వంటను వండుకుంటే కూరంతా అద్భుతమైన సువాసనతో వస్తుంది.
వెల్లుల్లి ప్రయోజనాలను ఆస్వాదించడానికి వెల్లుల్లి నూనె మరొక అనుకూలమైన మార్గం. వెల్లుల్లి-ఇన్ఫ్యూజ్డ్ నూనెను వంటల్లో, సలాడ్ డ్రెస్సింగ్‌ల్లో వాడుకోవచ్చు. ముందుగా వెల్లుల్లి నూనెను తయారు చేయడానికి వెల్లుల్లి రెబ్బలను దంచి చూర్ణం చేయాలి. ఆపై వాటిని ఒక కప్పులో ఆలివ్ నూనె లేదా అవకాడో నూనె వంటి అధిక-నాణ్యత వంట నూనెతో కలపాలి. ఈ మిశ్రమాన్ని తక్కువ వేడి మీద 10 నిమిషాలు వేడి చేయాలి. అయితే ఈ సమయంలో వెల్లుల్లి మాడిపోకుండా చూసుకోవాలి. వేడి తగ్గిన తర్వాత నూనెను వడకట్టి గాలి చొరబడని సీసాకు బదిలీ చేయాలి. వెల్లుల్లి నూనెను రిఫ్రిజిరేటర్‌లో రెండు వారాల వరకు నిల్వ చేసుకోవచ్చు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..