ఈ అందమైన మసాలా సుగంధ ద్రవ్యాల రాజు..! ఆ సమస్యల పాలిట లక్ష్మణరేఖ..!!

భారతీయ వంటగదులు రుచికి నిలయం మాత్రమే కాదు..ఆరోగ్యానికి కేంద్ర బిందువులు. ఎన్నో రకాల ఔషధాలకు నిధులు. అలాంటి ఒక నిధి పిప్పలి. ఇది ఒక అద్భుతమైన ఆయుర్వేద ఔషధం. ఇది జీర్ణ, శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనాన్ని అందించడమే కాకుండా, అనేక ఇతర వ్యాధులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉబ్బసం, బ్రోన్కైటిస్, ఇతర శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారికి ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది.

ఈ అందమైన మసాలా సుగంధ ద్రవ్యాల రాజు..! ఆ సమస్యల పాలిట లక్ష్మణరేఖ..!!
Pippali

Updated on: Jan 27, 2026 | 9:56 PM

భారతీయ వంటగదులు రుచికి నిలయం మాత్రమే కాదు..ఆరోగ్యానికి కేంద్ర బిందువులు. ఎన్నో రకాల ఔషధాలకు నిధులు. అలాంటి ఒక నిధి పిప్పలి. ఇది ఒక అద్భుతమైన ఆయుర్వేద ఔషధం. ఇది జీర్ణ, శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనాన్ని అందించడమే కాకుండా, అనేక ఇతర వ్యాధులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉబ్బసం, బ్రోన్కైటిస్, ఇతర శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారికి ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. పిప్పలి శరీరం నుండి కఫం, శ్లేష్మాన్ని బయటకు పంపడంలో సహాయపడుతుంది. దీని శోథ నిరోధక లక్షణాలు నొప్పిని, ముఖ్యంగా కీళ్ల నొప్పి, వాపును కూడా తగ్గిస్తాయి. ప్రముఖ ఆయుర్వేద గ్రంథమైన చరక సంహిత, పిప్పలిని వివిధ రకాల వ్యాధుల చికిత్సలో ఉపయోగించే ఒక ముఖ్యమైన ఔషధ మూలికగా వర్ణిస్తోంది. పూర్తి వివరాలేంటో ఇక్క చూద్దాం..

పిప్పలిని సుగంధ ద్రవ్యాలలో రాజుగా పిలుస్తారు. గత కొన్ని శతాబ్దాలుగా ఆయుర్వేద ఔషధాల్లో పిప్పలిని ఉపయోగిస్తున్నారు. దీనిలో పిపెరిన్ అనే క్రియాశీల పదార్థం ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడం, శ్వాస సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. ఆర్థరైటిస్, కడుపు మంట చికిత్సతో సహా చాలా రకాలుగా ఇది నివారణకు ఉపయోగపడుతుంది. పిప్పలి పొడిలోని పిపెరిన్, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్లను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది.

పిప్పలి పొడి, తేనె కలిపిన మిశ్రమం శ్వాస సంబంధిత సమస్యలను తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. దీని వల్ల కఫం, ముక్కులో రంధ్రాల సంశ్లేషణ తగ్గుతుంది. ఇది ఆస్తమా, బ్రాంకైటిస్, సర్ది, దగ్గు వంటి సమస్యలకు సహాయపడుతుంది. పిప్పలిని తీసుకోవటం వల్ల పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అద్భుతంగా సహాయపడుతుంది. పిప్పలి పొడి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. శరీరంలో విష వ్యర్థాలను తొలగించడంలో ఉపయోగపడుతుంది. తేనెతో కలిపి తీసుకుంటే రక్తం శుద్ధి చేయబడుతుంది. గుండె ఆరోగ్యానికి మేలు కలిగిస్తుంది.

ఇవి కూడా చదవండి

పిప్పలి జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రోత్సహించి, ఆహార శోషణను మెరుగుపరుస్తుంది. దీని వల్ల జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. ఇందులో ఉండే లక్షణాలు కడుపులో మంటను తగ్గిస్తాయి. పిప్పలి శక్తివంతమైన శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది నొప్పి, వాపు, దృఢత్వం వంటి ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..