ఉదయాన్నే మారేడు పండు జ్యూస్ తాగితే.. శరీరానికి ఆరోగ్య మంత్రం వేసినట్టే..! మస్త్‌ మస్త్‌ బెనిఫిట్స్‌..

మారేడు ఆకులను ఎంతో పవిత్రంగా భావిస్తాము. ఆ పరమశివుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఒక్క మారేడు దళం సమర్పిస్తే చాలని భక్తులు నమ్ముతారు. అలాంటి మారేడు పండు ఆరోగ్యానికి అమృతం వంటిది అంటున్నారు ఆయుర్వే నిపుణులు. మారేడు పండు తిన్నా, లేదా జ్యూస్ చేసుకొని తాగినా కూడా ఆరోగ్యానికి కలిగే మేలు ఎంతో ఉందని చెబుతున్నారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో మారేడు పండు జ్యూస్ తాగటం వల్ల మీరు ఊహించని లాభాలు కలుగుతాయని చెబుతున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం...

ఉదయాన్నే మారేడు పండు జ్యూస్ తాగితే.. శరీరానికి ఆరోగ్య మంత్రం వేసినట్టే..! మస్త్‌ మస్త్‌ బెనిఫిట్స్‌..
Bael Juice

Updated on: Oct 03, 2025 | 2:04 PM

మారేడు పండులో అదిక ఫైబర్ ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని నివారించడంతో పాటు గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. మారేడు పండులోని యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు చర్మంపై మంట, వాపు వంటి సమస్యలను నివారిస్తాయి. మారేడు పండులోని సమ్మేళనాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. తద్వారా అనేక రకాల ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుకోవచ్చు. మారేడు పండులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది వేడి వాతావరణంలో మీ శరీరం కోల్పోయిన లవణాలను తిరిగి అందించి బాడీని హైడ్రేట్ చేస్తుంది.

దీనిలోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్స్ ఉండడం వలన మారేడు పండు జ్యూస్ ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తుంది. ఈ జ్యూస్ రోజు తాగడం వలన చర్మం ముడుతలు రాకుండా ,ప్రకాశవంతంగా ఉండేలా చేస్తుంది. బేల్‌లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇది శరీరం నుండి విషాన్ని బయటకు పంపడంలో సహాయపడుతుంది, ఇన్ఫెక్షన్, వాపును నివారిస్తుంది. వేసవిలో సాధారణంగా వచ్చే జ్వరం, జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్లకు బేల్ రసం మంచి సహజ నివారణ.

బేల్ రసం చర్మానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది శరీరాన్ని విష పదార్థాలను శుభ్రపరుస్తుంది. శరీరాన్ని స్పష్టంగా, ప్రకాశవంతంగా ఉంచుతుంది. అంతేకాకుండా, ఇది మొటిమలు, మచ్చలు, వడదెబ్బను నివారించడానికి సహాయపడుతుంది . బేల్‌లోని పోషకాలు జుట్టును బలోపేతం చేస్తాయి మరియు చుండ్రుతో పోరాడటానికి సహాయపడతాయి. మారేడు పండు జ్యూస్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచుతాయి. జీవక్రియ మెరుగు పరచడం లో మారేడు పండు జ్యూస్ ఎంతో ఉపయోగపడుతుంది. మారేడు పండులో విటమిన్ ఎ ఉంటుంది. ఇది కంటి సంబంధ సమస్యలు రాకుండా కాపాడుతుంది. తద్వారా కంటిచూపు మెరుగ్గా ఉంటుంది. మారేడు పండులోని యాంటీ ఆక్సిడెంట్లు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. అలాగే గుండె సంబంధ సమస్యలు రాకుండా కాపాడతాయి.

ఇవి కూడా చదవండి

(గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఆహారంలో ఏమైనా మార్పులు చేసే ముందు వైద్యుడిని లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించడం తప్పనిసరి.)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..