రోజూ గుప్పెడు కిస్మిస్‌లు.. ఇలా తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

|

Jan 03, 2025 | 9:22 PM

తద్వారా రక్తహీనత ఏర్పడకుండా కాపాడుకోవచ్చు. నానబెట్టిన కిస్మిస్‌లోని ఫ్రక్టోస్, గ్లూకోజ్ మీకు తక్షణ శక్తిని అందిస్తుంది. అలాగే రోజంతా ఉల్లాసంగా ఉండేలా చేస్తాయి. రెగ్యులర్‌గా వీటిని తింటే చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. నానబెట్టిన కిస్మిస్‌లో ఓలినోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది దంతక్షయం ఏర్పడకుండా..

రోజూ గుప్పెడు కిస్మిస్‌లు.. ఇలా తింటే ఎన్ని లాభాలో తెలుసా..?
Soaked Raisins
Follow us on

ఎండుద్రాక్ష..దీనినే కిస్మిస్ అని కూడా అంటారు. రుచిలో అద్భుతంగా ఉండే ఈ డ్రైఫ్రూట్‌ పోషకాల నిధిగా పిలుస్తారు. ఎందుకంటే, కిస్మిస్‌తో లెక్కకు మించి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉంటాయి. అయితే, వీటిని సరైన సమయంలో సరైన విధానంలో తింటేనే పూర్తి ప్రయోజనాలు అందుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరానికి పొటాషియం, ఐరన్ వంటి పోషకాలు కిస్మిస్‌తో లభిస్తాయి. కిస్మిస్‌లో పోలీఫెనోల్, ఫ్లెవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నాశనం చేస్తాయి. స్వెల్లింగ్ తగ్గిస్తుంది. సూక్ష్మ క్రిములు వృద్ధి చెందకుండా కాపాడుతాయి. గుండె వ్యాధులు, కేన్సర్ వంటి వ్యాధుల ముప్పు తగ్గుతుంది. కిస్మిస్ తినాల్సిన సరైన సమయం కిస్మిస్ తినే సరైన సమయం ఉదయం వేళ.

రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయం పరగడుపున తీసుకుంటే అద్భుతమైన లాభాలున్నాయి. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపు సంబంధిత సమస్యలు తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మధ్యాహ్నం వేళ చాలామందికి ఎనర్జీ తక్కువగా ఉండి నీరసంగా అన్పిస్తుంటుంది. ఈ సమయంలో కిస్మిస్ తినడం అలవాటు చేసుకుంటే చాలా మంచిది. ఇందులో నేచురల్ స్వీట్ ఉంటుంది. నానబెట్టిన కిస్మిస్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి తినడం వల్ల తొందరగా కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. తద్వారా బరువు అదుపులో ఉంటుంది.

రక్తహీనత దూరం చేస్తుంది. నానబెట్టిన కిస్మిస్‌లో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. ఇది ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. తద్వారా రక్తహీనత ఏర్పడకుండా కాపాడుకోవచ్చు. నానబెట్టిన కిస్మిస్‌లోని ఫ్రక్టోస్, గ్లూకోజ్ మీకు తక్షణ శక్తిని అందిస్తుంది. అలాగే రోజంతా ఉల్లాసంగా ఉండేలా చేస్తాయి. రెగ్యులర్‌గా వీటిని తింటే చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. నానబెట్టిన కిస్మిస్‌లో ఓలినోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది దంతక్షయం ఏర్పడకుండా నివారిస్తుందని చెబుతారు. తద్వారా దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..