
చాలా మందికి నాన్-వెజ్ ఫుడ్ తినడమంటే చాలా ఇష్టం. అందులోనూ చికెన్, మటన్, చేప, గుడ్డు, రొయ్యలు వంటి వివిధ ఆహార పదార్ధాలను తినడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు కూడా లభిస్తాయి. మాంసం, చేపలు , గుడ్లు ప్రోటీన్ కి మంచి వనరులు. ఇవి కండరాలను బలోపేతం చేయడానికి, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. శాఖాహార ఆహారం కంటే మాంసాహార ఆహారంలోనే విటమిన్ బి12 ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు. దీనితో పాటు ఐరెన్, జింక్, విటమిన్ డి సహా అనేక ఇతర విటమిన్లు లభిస్తాయి. చేపలు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలకు మంచి మూలం. ఇది మెరిసే చర్మానికి అలాగే మెదడు, గుండె ఆరోగ్యానికి అవసరం.
చాలా మంది రోజూ లేదా రెండు రోజులకు ఒకసారి నాన్-వెజ్ తినడానికి ఇష్టపడతారు, ముఖ్యంగా ఫిట్‌నెస్ ఫ్రీక్స్, దీన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయని వారు భావిస్తారు. అయితే రోజూ లేదా అధికంగా నాన్-వెజ్ తినడం కూడా ఆరోగ్యానికి హానికరం, ముఖ్యంగా వేసవి కాలంలో దీనిని పరిమిత పరిమాణంలో తినాలి. నాన్ వెజ్ ప్రియులకు నిపుణుల సలహా ఏమిటంటే..
ఢిల్లీలోని శ్రీ బాలాజీ యాక్షన్ మెడికల్ ఇన్స్టిట్యూట్ చీఫ్ డైటీషియన్ ప్రియా పాలివాల్ మాట్లాడుతూ.. ఎక్కువగా నాన్-వెజ్ తినడానికి ఇష్టపడి వేసవిలో కూడా మాంసాహారం అధిక పరిమాణంలో తినేవారు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఎందుకంటే నాన్-వెజ్ శరీరంలో వేడిని పెంచుతుంది. అంతేకాదు అజీర్ణం, ఆమ్లత్వం, అలసట వంటి సమస్యలను కలిగిస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)