AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uric Acid Control Tips: యూరిక్ యాసిడ్‌తో ఇబ్బందా.. వీటిని ఖచ్చితంగా తినండి!

యూరిక్ యాసిడ్ అంటే చాలా మందికి తెలీదు. యూరిక్ యాసిడ్ అనేది శరీరం సహజంగా విసర్జించే వ్యర్థ పదార్థాల్లో ఇది కూడా ఒకటి. రక్తంలో యాసిడ్ పెరిగితే.. దాన్ని హైపర్యూరిసెమియా అంటారు. కిడ్నీలు రక్తంలోని యాసిడ్‌ను సరిగ్గా తొలగించ లేకపోతే.. యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగి పోతాయి. సాధారణంగా మనం తీసుకునే ఆహారాల్లో ప్యూరిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది విచ్ఛిన్నం అయినప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఈ యాసిడ్ ఎప్పటికప్పుడు యూరిన్ ద్వారా..

Uric Acid Control Tips: యూరిక్ యాసిడ్‌తో ఇబ్బందా.. వీటిని ఖచ్చితంగా తినండి!
Uric Acid Control Tips
Chinni Enni
|

Updated on: Apr 02, 2024 | 4:10 PM

Share

యూరిక్ యాసిడ్ అంటే చాలా మందికి తెలీదు. యూరిక్ యాసిడ్ అనేది శరీరం సహజంగా విసర్జించే వ్యర్థ పదార్థాల్లో ఇది కూడా ఒకటి. రక్తంలో యాసిడ్ పెరిగితే.. దాన్ని హైపర్యూరిసెమియా అంటారు. కిడ్నీలు రక్తంలోని యాసిడ్‌ను సరిగ్గా తొలగించ లేకపోతే.. యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగి పోతాయి. సాధారణంగా మనం తీసుకునే ఆహారాల్లో ప్యూరిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది విచ్ఛిన్నం అయినప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఈ యాసిడ్ ఎప్పటికప్పుడు యూరిన్ ద్వారా బయటకు వెళ్లి పోవాలి. అలా జరగకపోతే రక్తంలో దీని స్థాయిలు అనేవి పెరిగిపోతాయి. దీంతో అవి స్పటికాలుగా మారి.. కీళ్లు, కీళ్ల చుట్టూ ఉండే కణజాలాల్లో పేరుకు పోతాయి. దీని వల్ల డయాబెటీస్, అధిక బరువు పెరగడం, క్యాన్సర్, కీళ్ల నొప్పులు, కిడ్నీ ప్రాబ్లమ్స్, గుండె సమస్యలు, కడుపులో మంట, హైపోథైరాయిడిజం వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి శరీరంలో ఈ యూరిక్ యాసిడ్ స్థాయిలు అనేవి.. ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకోవాలి. దీన్ని కూడా ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు.

జామకాయ:

యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడానికి, వాటిని విచ్ఛిన్నం చేసి, మూత్రం ద్వారా పంపించడానికి సరిపడా ఆహారం తీసుకోవాలి. యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో జామకాయ చక్కగా హెల్ప్ చేస్తుంది. యూరిక్ యాసిడ్ సమస్య ఉన్న వారు రోజూ ఉదయం ఖాళీ కడుపుతో జామ కాయ తినాలి. ఇందులో ఉండే విటమిన్ సి.. యూరిక్ యాసిడ్‌ను నియంత్రణలో ఉంచుతుంది.

నిమ్మకాయ:

శరీరంలో యూరిక్ యాసిడ్‌ను తగ్గించడంలో నిమ్మకాయ అద్భుతంగా పని చేస్తుంది. నిమ్మకాయ తీసుకోవడం వల్ల శరీరంలో ఆల్కలీన్ ప్రభావం పెరుగుతుంది. దీంతో యూరిక్ యాసిడ్ స్థాయిలు అనేవి తగ్గుతాయి. ప్రతి రోజూ ఉదయం గోరు వెచ్చటి నీటిలో నిమ్మకాయ రసం కలుపుకుని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఫైబర్:

ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ లెవల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. ఫైబర్ ఉండే కూరగాయలు, పండ్లు తీసుకుంటే యూరిక్ యాసిడ్ లెవల్స్ అనేవి తగ్గుతాయి. అంతే కాకుండా ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అదే విధంగా ఆకు కూరలు, నట్స్ కూడా తీసుకుంటే యూరిక్ యాసిడ్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్
యాపిల్‌ కొత్త మోడల్‌ ఫోన్ గురించి ఆసక్తికర విషయం తెలుసా
యాపిల్‌ కొత్త మోడల్‌ ఫోన్ గురించి ఆసక్తికర విషయం తెలుసా
ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఫ్రీ జర్నీ.. ప్రభుత్వం నంచి ప్రకటన..
ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఫ్రీ జర్నీ.. ప్రభుత్వం నంచి ప్రకటన..
యాపిల్‌ మ్యూజిక్‌ యాప్‌లో కొత్త ఫీచర్లు ఇవే
యాపిల్‌ మ్యూజిక్‌ యాప్‌లో కొత్త ఫీచర్లు ఇవే