Success Story: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి గాడిద పాలు అమ్ముకుంటున్న యువకుడు.. లక్షల్లో సంపాదన

|

Sep 29, 2022 | 2:07 PM

గాడిద‌ల ఫామ్‌ను ఓపెన్ చేశాడు. ఇలాంటి ఫామ్ క‌ర్ణాట‌క‌లోనే మొద‌టి కాగా, దేశంలో రెండోది. ఇంత‌కుముందు ఒక‌రు కేర‌ళ‌లోని ఎర్నాకులంలో గాడిద ఫామ్ ప్రారంభించారు.

Success Story: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి గాడిద పాలు అమ్ముకుంటున్న యువకుడు.. లక్షల్లో సంపాదన
Donkey Milk Business
Follow us on

Success Story: యువ‌త అంతా చ‌దువులు అయిపోగానే ఏసీ గదుల్లో చక్కటి కొలువుల కోసం క్యూ క‌డుతున్నారు. పెద్ద పెద్ద ప్యాకేజీల కోసం సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల వైపు చూస్తున్నారు. కానీ ఐటీ జాబ్‌ను కాద‌ని ఓ యువకుడు గాడిద పాలు అమ్ముతున్నాడు. గాడిద పాల‌ని చీప్‌గా తీసేయ‌కండి. ఇప్పటికే ఈ గాడిద పాల‌కోసం 17 ల‌క్షల ఆర్డర్లు కూడా సంపాదించి ఔరా అనిపిస్తున్నాడు. క‌ర్ణాట‌కకు చెందిన శ్రీనివాస్‌గౌడ ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో మంచి ప్యాకేజీతో జాబ్ సంపాదించాడు. అయితే, చేసే జాబ్ నచ్చక 2020లో ఉద్యోగం మానేశాడు. త‌న సొంత గ్రామం ఇరాలో రెండు ఎక‌రాల స్థలంలో ఇసిరి ఫామ్స్ ప్రారంభించాడు. సమగ్ర వ్యవసాయం, పశుసంవర్ధక, పశువైద్య సేవలు, శిక్షణ, పశుగ్రాసం అభివృద్ధి కేంద్రాన్ని నెల‌కొల్పాడు. ప్రస్తుతం త‌న ఫామ్‌లో మేక‌లు, కుందేళ్లు, క‌డ‌క్‌నాథ్ కోళ్లను పెంచుతున్నాడు.

ఇటీవల అక్కడే గాడిద‌ల ఫామ్‌ను ఓపెన్ చేశాడు. ఇలాంటి ఫామ్ క‌ర్ణాట‌క‌లోనే మొద‌టి కాగా, దేశంలో రెండోది. ఇంత‌కుముందు ఒక‌రు కేర‌ళ‌లోని ఎర్నాకులంలో గాడిద ఫామ్ ప్రారంభించారు. ఇందులో 20 గాడిద‌ల‌ను పెంచ‌ుతున్నట్లు శ్రీనివాస్ తెలిపాడు. గాడిద పాలు చాలా రుచిక‌రంగా ఉంటాయని, ఇందులో ఔష‌ధ విలువ‌లుంటాయి. అందుకే ఇవి చాలా ఖ‌రీదు. చిన్న చిన్న ప్యాకెట్లతో గాడిద పాల‌ను మాల్స్‌, షాపులు, సూప‌ర్ మార్కెట్ల, బ్యూటీ ప్రొడ‌క్ట్స్ కోసం స‌ర‌ఫరా చేసేందుకు శ్రీనివాస్ యోచిస్తున్నాడు. ఇప్పటికే త‌న‌కు గాడిద పాల కోసం 17ల‌క్షల విలువైన ఆర్డర్స్ వ‌చ్చాయని ఆనందంగా చెబుతున్నాడు శ్రీనివాస్‌గౌడ‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..