Strawberry : బ్యూటీ కోసం స్ట్రాబెర్రీ..! యువతకు మంచి కిక్కిచ్చే ఫ్రూట్.. ప్రయోజనాలు అద్భుతం..

|

Jul 26, 2021 | 11:50 AM

Strawberry : స్ట్రాబెర్రీస్‌లో చర్మ సంరక్షణకు ఉపయోగపడే చాలా పోషకాలు ఉంటాయి. అందుకే వీటిని మీ డైట్‌లో చేర్చుకుంటే మంచిది.

Strawberry : బ్యూటీ కోసం స్ట్రాబెర్రీ..! యువతకు మంచి కిక్కిచ్చే ఫ్రూట్.. ప్రయోజనాలు అద్భుతం..
Strawberry
Follow us on

Strawberry : స్ట్రాబెర్రీస్‌లో చర్మ సంరక్షణకు ఉపయోగపడే చాలా పోషకాలు ఉంటాయి. అందుకే వీటిని మీ డైట్‌లో చేర్చుకుంటే మంచిది. ఇది కాకుండా ఫేస్‌మాస్క్‌లు, స్క్రబ్‌లు, ఫేషియల్స్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతాయి. స్ట్రాబెర్రీలు తినడానికి రుచికరమైనవే కాకుండా వీటిని క్రమం తప్పకుండా ఉపయోగిస్తే చర్మం మెరుస్తూ ఉంటుంది. అయితే ఎలా ఉపయోగించాలో కొన్ని పద్దతులను తెలుసుకుందాం.

1. చర్మం ప్రకాశవంతం చేయడానికి పనిచేస్తుంది
స్ట్రాబెర్రీ రసం చర్మం రంగును మార్చడానికి ఉపయోగిస్తారు. ముఖంపై మొటిమలు, మచ్చలను తొలగిస్తుంది. దీని కోసం మీరు ఒక గిన్నెలో మూడు నాలుగు స్ట్రాబెర్రీలను వేసి రసాన్ని తీయాలి. దీనిని ముఖం మొత్తం అప్లై చేయాలి. సుమారు 20 నిమిషాలు ఉంచి ఆరిన తర్వాత చల్లటి నీటితో కడగాలి. మంచి ఫలితాలను పొందడానికి వారానికి మూడుసార్లు చేయాలి.

2. మొటిమలను వదిలిస్తుంది..
స్ట్రాబెర్రీస్‌లో ప్రక్షాళన లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మంపై డెడ్ సెల్స్‌ని తొలగిస్తాయి. చర్మాన్ని శుభ్రపరుస్తుంది. మీరు స్ట్రాబెర్రీలను కలిగి ఉన్న ఫేస్ వాష్‌ను ఉపయోగించవచ్చు.

3. టోనర్
100 గ్రాముల రోజ్ వాటర్‌కు 2 టీస్పూన్ల స్ట్రాబెర్రీ జ్యూస్ కలపండి. రాత్రి పడుకునే ముందు దూది సాయంతో ముఖంపై అప్లై చేయండి. మీరు ఈ మిశ్రమాన్ని 15 రోజులు ఫ్రిజ్‌లో ఉంచవచ్చు. మెరిసే చర్మం పొందడానికి రోజూ వాడండి.

4. మెరిసే చర్మం కోసం స్ట్రాబెర్రీ స్క్రబ్
మీరు 5 నుంచి 6 స్ట్రాబెర్రీలను మెత్తగా కలపాలి. దానికి 2 టీస్పూన్ల తేనె కలపాలి. స్ట్రాబెర్రీ విత్తనాలు కూడా ఈ పేస్ట్‌లో ఉండాలి. అందులో కొన్ని చుక్కల వేడినీరు వేయాలి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసి సుమారు 10 నిమిషాలు అలాగే ఉంచి మసాజ్ చేయండి. మీరు ఈ రెమెడీని వారానికి 3 రోజులు ప్రయోగిస్తే కొన్ని వారాల్లో మీకు మెరిసే చర్మం సొంతమవుతుంది.

5. కంటి చూపునకు..
కంటి ఆరోగ్యానికి స్ట్రాబెర్రీ ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్‌ కంటి శుక్లాలను నివారించడంతో, అంధత్వాన్ని దూరం చేయడంలో క్రీయశీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే విటమిన్‌ సి.. ఫ్రీరాడికల్స్‌ నుంచి కళ్లను కాపాడుతుంది.

6. నోటి సమస్యలను..
క్రమం తప్పుకుండా స్ట్రాబెర్రీని ఆహారంలో భాగం చేసుకుంటే నోటి సమస్యలను చెక్‌ పెట్డవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా నోటి క్యాన్సర్‌ను దూరం చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా నోటి దుర్వాసనతో పాటు దంత సమస్యలను కూడా నివారించవచ్చు.

రోజూ ఈ చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నారా ? అయితే జాగ్రత్త సుమా.. ఆరోగ్యానికి యమ డేంజర్ అంటున్న నిపుణులు..

Red Ladies Finger: అరుదైన పంట ఎర్రబెండ.. దీని వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!

Weight Loss: అధిక కొవ్వుతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ డ్రింక్‌ను తాగిచూడండి.. అద్భుతఫలితం మీ సొంతం