AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Idli Recipe : అరెరే ఇడ్లీలు చేయడం ఇంత ఈజీనా.. ఇది తెలియక తెగ కష్టపడ్డమే!

దూది లాంటి మృదువైన ఇడ్లీలను ఇంట్లోనే తయారు చేయడం అంత సులభం కాదు. సరైన కొలతలు, పిండి పులిసే విధానం పైనే ఇడ్లీల మెత్తదనం ఆధారపడి ఉంటుంది. మినపప్పు, ఇడ్లీ రవ్వను సరైన నిష్పత్తిలో నానబెట్టడం ప్రధానమైన మొదటి మెట్టు. పప్పు రుబ్బేటప్పుడు తీసుకునే చర్యలు ఇడ్లీలు మరింత స్పాంజీలా వస్తాయి. పిండిని రుబ్బిన తర్వాత ఎలా పులియబెట్టాలి వంటివి అత్యంత ముఖ్యమైన విషయాలు.. ఈ చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే హోటల్ శైలిలో దూది లాంటి ఇడ్లీలను ప్రతిసారీ ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఇక్కడ చూద్దాం..

Idli Recipe : అరెరే ఇడ్లీలు చేయడం ఇంత ఈజీనా.. ఇది తెలియక తెగ కష్టపడ్డమే!
How To Make Soft Idlis
Jyothi Gadda
|

Updated on: Aug 26, 2026 | 6:48 PM

Share

దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మార్నింగ్‌ టిఫిన్ ఇడ్లీ. తేలికగా అరిగే ఆహారం కావడంతో చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. అయితే ఇంట్లో తయారు చేసే ఇడ్లీలు కొన్నిసార్లు గట్టిగా లేదా సరిగ్గా ఉడకకుండా వస్తుంటాయి. హోటల్లో దొరికే దూది లాంటి స్పాంజీ ఇడ్లీలను ఇంట్లోనే తయారు చేసుకోవడానికి కొన్ని సులువైన చిట్కాలు పాటించడం చాలా ముఖ్యం.

పప్పు, రవ్వల సరియైన నిష్పత్తి :

మృదువైన ఇడ్లీలకు మొదటి రహస్యం సరైన నిష్పత్తి. 1 కప్పు పొట్టు తీసిన మినపప్పుకి 2 లేదా 2.5 కప్పుల ఇడ్లీ రవ్వను ఎంచుకోవాలి. పప్పు నాణ్యతను బట్టి ఈ నిష్పత్తి మారుతుంది. పప్పును కనీసం 4-5 గంటలు, రవ్వను 2-3 గంటల పాటు విడివిడిగా నానబెట్టుకోవాలి.

అటుకులు లేదా మెంతుల వేయటం:

పప్పు నానబెట్టే సమయంలో ఒక టీస్పూన్ మెంతులు వేస్తే ఇడ్లీలు తెల్లగా రావడమే కాకుండా పిండి బాగా పులుస్తుంది. అలాగే పప్పు రుబ్బేటప్పుడు అర కప్పు నానబెట్టిన అటుకులు లేదా కొద్దిగా అన్నం కలిపి రుబ్బితే ఇడ్లీలు అద్భుతమైన స్పాంజీ రూపంలోకి వస్తాయి.

ఇవి కూడా చదవండి

గ్రైండింగ్ విధానం :

మినపప్పును రుబ్బేటప్పుడు ఒకేసారి నీళ్లు పోయకూడదు. కొద్దికొద్దిగా చల్లటి నీరు చల్లుతూ రుబ్బడం వల్ల పిండి వేడెక్కకుండా బాగా పొంగుతుంది. పిండి వెన్నలా మెత్తగా వచ్చే వరకు రుబ్బాలి.

సరిగ్గా పులియబెట్టడం:

రుబ్బిన మినపపిండిలో నానబెట్టిన రవ్వను బాగా పిండి కలపాలి. ఈ పిండిని కనీసం 8-10 గంటల పాటు వెచ్చని ప్రదేశంలో ఉంచాలి. చలికాలంలో పిండి త్వరగా పులియదు కాబట్టి ఓవెన్ లోపల లేదా లైట్ కింద ఉంచడం మంచిది. పిండి బాగా పొంగితేనే ఇడ్లీలు మృదువుగా వస్తాయి.

ఆవిరి పట్టే సమయం :

ఇడ్లీ పాత్రలో నీరు బాగా మరిగిన తర్వాత మాత్రమే ఇడ్లీ ప్లేట్లను లోపల ఉంచాలి. మీడియం మంటపై సరిగ్గా 10 నుండి 12 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఎక్కువ సమయం ఉడికిస్తే ఇడ్లీలు గట్టిపడతాయి. పొయ్యి ఆపిన తర్వాత 2 నిమిషాలు ఆగి ప్లేట్లను బయటకు తీసి, నీళ్ల తడి చేసిన స్పూన్‌తో తీస్తే ఇడ్లీలు ప్లేట్‌కు అంటుకోకుండా నీట్‌గా వస్తాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us