AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Soaked Rice: అన్నం వండే ముందు బియ్యాన్ని నానబెట్టి వండితే ఎన్ని లాభాలో తెలుసా?

ఉదయం, సాయంత్రం ఏం తిన్నా.. మధ్యాహ్నం మాత్రం ఖచ్చితంగా అన్నం తింటారు. ఇంకొంత మంది సాయంత్రం కూడా అన్నం తింటారు. అన్నం తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఏదన్నా సరే మితంగా తీసుకోవాలి. మితంగా అన్నం తింటే కూడా వెయిట్ లాస్ అవ్వొచ్చు. ఎందుకంటే అన్నంలో ఫైబర్, కార్బోహైడ్రేట్స్, క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా తీసుకుంటే బరువు..

Soaked Rice: అన్నం వండే ముందు బియ్యాన్ని నానబెట్టి వండితే ఎన్ని లాభాలో తెలుసా?
Soaked Rice
Chinni Enni
|

Updated on: May 21, 2024 | 1:07 PM

Share

ఉదయం, సాయంత్రం ఏం తిన్నా.. మధ్యాహ్నం మాత్రం ఖచ్చితంగా అన్నం తింటారు. ఇంకొంత మంది సాయంత్రం కూడా అన్నం తింటారు. అన్నం తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఏదన్నా సరే మితంగా తీసుకోవాలి. మితంగా అన్నం తింటే కూడా వెయిట్ లాస్ అవ్వొచ్చు. ఎందుకంటే అన్నంలో ఫైబర్, కార్బోహైడ్రేట్స్, క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా తీసుకుంటే బరువు పెరుగుతారు. అయితే అన్నాన్ని కూడా వండే పద్దతిలో కూడా చాలా ఉంటాయి. ఆ ప్రకారంగా వండితే.. అన్నం తింటే చాలా లాభాలు కలుగుతాయి. సాధారణంగా బియ్యం కడిగేసి.. స్టవ్‌పై పెట్టి అన్నం వండుతారు. అలా కాకుండా.. అన్నాన్ని వండే ముందు బియ్యాన్ని నానబెట్టి వండితే చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

షుగర్ లెవల్స్ కంట్రోల్:

బియ్యాన్ని నానబెట్టిన అన్నం తీసుకుంటే.. కలిగే లాభాల్లో ఇది కూడా ఒకటి. ఇలా నానబెట్టిన అన్నం తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ అనేవి ఒక్కసారిగా పెరగకుండా.. మెల్లిగా పెరుగుతాయి. ఇలా అన్నాన్ని వండటం షుగర్ ఉన్నవారికి చాలా మంచిది.

జీర్ణ సమస్యలకు చెక్:

బియ్యాన్ని నానబెట్టి వండటం వల్ల.. అన్నంలో ఉండే పోషకాలు శరీరానికి అందుతాయి. బియ్యాన్ని నీటిలో నానబెట్టి తింటే.. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ నార్మల్ చక్కెరలుగా మారతాయి. దీంతో తిన్న అన్నం సులువుగా జీర్ణం అవుతుంది. అంతే కాకుండా కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు, అజీర్తి సమస్యలు కూడా దూరం అవుతాయి. దీంతో బరువు కూాడా తగ్గుతారు.

ఇవి కూడా చదవండి

పోషకాలు అందుతాయి:

నానబెట్టిన బియ్యంతో అన్నం వండితే.. శరీరంలోని పోషకాలు చక్కగా అందుతాయి. అంతే కాకుండా ఖనిజాలు, విటమిన్లు కూడా ఎక్కువగా అందుతాయి.

అన్నం విడివిడిగా ఉంటుంది:

నానబెట్టిన బియ్యంతో అన్నం వండితే.. అన్నం ముద్ద అవ్వకుండా పలుకుగా.. మెతుకు మెతుకుగా ఉడుకుతుంది. త్వరగా ముద్ద అవ్వకుండా ఉంటుంది.

త్వరగా ఉడుకుతుంది:

నానబెట్టిన బియ్యంతో అన్నం వండితే త్వరగా ఉడుకుతుంది. దీంతో మీకు సమయంతో పాటు గ్యాస్ కూడా ఆదా అవుతుంది. నానబెట్టి అన్నం వండటం వల్ల అన్నం కూడా ఎక్కువ అవుతుంది. ఈ సారి అన్నం వండేటప్పుడు మీరు కూడా ఇలా ట్రై చేయండి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్