Litchi Benefits: సమ్మర్‌లో తినాల్సిన పండు ఇదే.. డోంట్ మిస్!

|

Mar 23, 2024 | 6:47 PM

వేసవి కాలం వచ్చేసింది. వాతావరణం మారగానే ఆరోగ్యంలో కూడా అనేక మార్పులు చేర్పులు కూడా వస్తాయి. దీంతో అసలట, నీరసం, వాంతులు, విరేచనాలు ఇలా చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఇవేమీ దరి చేరకుండా ఉండాలంటే.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అందులోనూ సీజన్‌లో దొరికే పండ్లు తీసుకోవడం చాలా ముఖ్యం. సమ్మర్‌లో లభ్యమయ్యే పండ్లలో లీచీ పండ్లు కూడా ఒకటి. ఈ పండులో శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల పోషకాలు..

Litchi Benefits: సమ్మర్‌లో తినాల్సిన పండు ఇదే.. డోంట్ మిస్!
వేసవి అంటే రకరకాల పండ్ల సీజన్. పుచ్చకాయలు, మామిడిపళ్లు, పనసపండ్లు, ఖర్జూరం వంటి ఎన్నో రకాల పండ్లు మార్కెట్‌లో దర్శనమిస్తాయి. ఈ పండ్లన్నీ సాధారణంగా అందరూ ఎంతో ఇష్టపడి తింటారు. వేసవి పండ్లలో లిచ్చి కూడా ఒకటి. ఇది జ్యుసిగా, తినడానికి రుచిగా ఉంటుంది. అందుకే పిల్లలకు ఈ పండు అంటే చాలా ఇష్టం. స్వీట్స్‌ తినడానికి వీలులేని వృద్ధులు కూడా లిచ్చి పండ్లను ఆరగిస్తారు.
Follow us on

వేసవి కాలం వచ్చేసింది. వాతావరణం మారగానే ఆరోగ్యంలో కూడా అనేక మార్పులు చేర్పులు కూడా వస్తాయి. దీంతో అసలట, నీరసం, వాంతులు, విరేచనాలు ఇలా చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఇవేమీ దరి చేరకుండా ఉండాలంటే.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అందులోనూ సీజన్‌లో దొరికే పండ్లు తీసుకోవడం చాలా ముఖ్యం. సమ్మర్‌లో లభ్యమయ్యే పండ్లలో లీచీ పండ్లు కూడా ఒకటి. ఈ పండులో శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇది చైనాకు చెందిన పండు. చాలా రుచిగా ఉంటుంది. ఎరుపు రంగులో గుండ్రగా, చిన్న ముళ్లు ఉండే పొరతో ఉంటుంది. లిచీ పండు తింటే తియ్యగా, పుల్లగా అనిపిస్తుంది. మరి లీచీ పండు తింటే ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

రక్త పోటును నివారిస్తుంది:

హైబీపీతో బాధ పడేవారు లీచీ పండ్లను తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల బీపీ అనేది అదుపులో ఉంటుంది.

రక్త హీనత సమస్య తగ్గుతుంది:

లీచీ పండ్లు తినడం వల్ల రక్త హీనత సమస్య నుంచి బయట పడొచ్చు. ఎందుకంటే ఇందులో ఐరన్, విటమిన్ సిలు ఉన్నాయి. కాబట్టి వీటిని తింటే రక్త హీనత సమస్య అదుపులో ఉంటుంది.

ఇవి కూడా చదవండి

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది:

లీచీ పండ్లు తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది. ఇందులో విటమిన్ సితో పాటు ఇతర పోషకాలు ఉంటాయి కాబట్టి.. ఈ పండ్లు తినడం వల్ల ఇమ్యూనిటీ లెవల్స్ పెరుగుతాయి. దీంతో వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది.

జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది:

లీచీ పండ్లు తినడం వల్ల జుట్టు కూడా ఆరోగ్యంగా, దృఢంగా ఉంటుంది. ఇందులో పోషకాలు మెండుగా ఉన్నాయి కాబట్టి.. జుట్టు రాలడం తగ్గి.. పెరిగేందుకు సహాయ పడుతుంది. చుండ్రు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.

చర్మ ఆరోగ్యం కూడా..

లీచీలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉంటాయి కాబట్టి.. చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. చర్మంపై మొటిమలు, ముడతలు, నలుపు వంటి సమస్యల బారిన పడకుంటా ఉంటారు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..