మన శరీరంలోని జ్ఞానేంద్రియాలలో చర్మం ఒకటి. శరీర అవయవాలను కప్పి ఉంచే అతి పెద్దని అవయవం.. అంతేకాదు మన శరీరంలో అత్యంత సున్నితమైన భాగం. చర్మానికి సంబంధించి చిన్న అజాగ్రత్త కూడా చాలా ఖరీదైనది. చాలా సార్లు ప్రజలు స్కిన్ అలెర్జీలతో బాధపడుతున్నారు. శరీరంలోని వివిధ భాగాల్లో దురద, దద్దుర్లు వంటి సమస్యలు మొదలవుతాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం అనేక కారణాల వల్ల స్కిన్ అలెర్జీలు సంభవిస్తాయి.
స్కిన్ అలెర్జీ సమస్యపై గురుగ్రామ్‌లోని నారాయణ హాస్పిటల్‌లోని సీనియర్ డైటీషియన్ మోహిని డోంగ్రే మాట్లాడుతూ.. కొన్ని రకాల మందులు, చర్మంలోని ద్రవ పదార్థాలు లేదా చెట్లు, మొక్కలు, జంతువులను తాకడం వలన కూడా సంభవించవచ్చు అని పేర్కొన్నారు. అయితే కొంతమందికి ఆహారం అంటే అలర్జీ కూడా ఉంటుంది. మరీ ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల తీవ్రంగా ఇబ్బందికి గురవుతారు. ఈ రోజు ఏయే ఆహార పదార్ధాలను తినడం వలన ఎక్కువగా చర్మానికి అలర్జీ వచ్చే ప్రమాదం ఉందో పోషకాహార నిపుణుల చెప్పిన విషయాలను తెలుసుకుందాం..
సీనియర్ డైటీషియన్ మోహిని డోంగ్రే మాట్లాడుతూ చర్మానికి అలర్జీని కలిగించే ఆహారాలు చాలానే ఉంటాయి. ఇందులో గుడ్డు, పాలు, చేపలు, గోధుమలు, సోయా, డ్రై ఫ్రూట్స్ వంకాయ, గోంగూర వంటివి ఉంటాయి. వీటిని తిన్న సమయంలో మీరు దురద, దద్దుర్లతో బాధపడుతున్నట్లు గుర్తిస్తే.. ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి.
నిపుణుల అభిప్రాయం ప్రకారం కొంతమందికి డ్రై ఫ్రూట్స్ వలన కూడా అలెర్జీ ఉండవచ్చు. వేరుశెనగ, జీడిపప్పు, బాదం, వాల్‌నట్ వంటి వాటిల్లో వేడి స్వభావం ఉంటుంది. డ్రై ఫ్రూట్స్‌తో అలెర్జీ బారిన పడిన వ్యక్తులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో పాటు చర్మం పై దురద, దద్దుర్లు ఎదుర్కొంటారు. అందువల్ల ఖచ్చితంగా ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.
సోయాబీన్ ప్రోటీన్ గొప్ప మూలంగా పరిగణించబడుతుంది. చాలా మందికి అలెర్జీలు లేదా చర్మం మీద తామరతో సమస్యలు ఉండవచ్చు. సోయాబీన్‌లో ఉండే ప్రొటీన్, లెసిథిన్ చర్మ అలెర్జీలకు కారణమవుతాయి. ఇప్పటికే అలెర్జీ సమస్యలు ఉన్నవారు సోయాబీన్‌కు దూరంగా ఉండడం ఆరోగ్యానికి మేలు.
కొంతమందికి పాల ఉత్పత్తులతో కూడా సమస్యలు ఉండవచ్చు. ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా అలర్జీకి గురవుతారు. పాలు, పెరుగు, జున్ను, వెన్న వంటి పాల ఉత్పత్తులు ఎగ్జిమాకు కారణమవుతాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఏవైనా ఆహారంగా తీసుకునే ముందు ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడం మలు)]