Kitchen Hacks: వదులుగా ఉండే ప్రెజర్ కుక్కర్ రబ్బర్ ను ఈ చిట్కాలతో సెట్ చేయండి..!

ప్రెజర్ కుక్కర్ ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. అన్నం నుంచి మాంసాహారం వరకు వివిధ రకాల వంటకాలను వండడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కానీ కొన్ని రోజుల తర్వాత కుక్కర్‌ రబ్బరు లూజ్ అవుతుంది. దానివల్ల మూత సరిగ్గా పట్టదు. విజిల్ రాదు. ఆహారం బయటకు వస్తుంది.

Kitchen Hacks: వదులుగా ఉండే ప్రెజర్ కుక్కర్ రబ్బర్ ను ఈ చిట్కాలతో సెట్ చేయండి..!
Pressure Cooker Care

Updated on: Feb 09, 2025 | 9:46 PM

కొన్ని కుక్కర్లలో రబ్బరు తరచుగా లూజ్ అవుతుంది. దానిని తరచుగా కొనడం ఖర్చుతో కూడుకున్నది. అయితే కుక్కర్ రబ్బర్‌ను ఇంట్లోనే సులభంగా ఎలా రిపేర్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్రిజ్‌లో ఉంచండి

మీరు కుక్కర్‌లో ఏదైనా ఆహారాన్ని ఉడికించబోతున్నట్లయితే.. కుక్కర్ రబ్బర్‌ను ఫ్రిజ్‌లో 15 నిమిషాలు ఉంచండి. ఇలా చేస్తే అది చల్లబడి తగ్గిపోతుంది. మూతపై పెట్టడం సులభం అవుతుంది.

పిండిని అప్లై చేయండి

కుక్కర్ రబ్బరును ఫ్రిజ్‌లో ఉంచిన తర్వాత కూడా అది వదులుగా ఉంటే.. కొద్దిగా పిండిని అప్లై చేసి ఆపై మూత పెట్టండి. విజిల్ సమయానికి రావడానికి మీరు పిండిని ఉపయోగించవచ్చు. మీరు కుక్కర్‌లో మాంసం, కూరగాయలు లేదా బియ్యం వండేటప్పుడు విజిల్ చాలా ముఖ్యం. ఒక్కోసారి సరిగా ఉడకకపోవచ్చు, నీరు ఎండిపోయి ఆహారం పాడైపోవచ్చు.

చల్లటి నీరు

మీరు ఫ్రిడ్జ్‌లో కుక్కర్ రబ్బరును ఉంచలేకపోతే కుక్కర్ రబ్బరును ఐస్ వాటర్‌లో కొంతసేపు ఉంచండి. ఇది రబ్బరును కుదించి, మూతలో బాగా సరిపోయేలా చేస్తుంది.

కడిగే విధానం

కుక్కర్ రబ్బరును కడిగేటప్పుడు కూడా జాగ్రత్త తీసుకోవాలి. మీరు దానిని సరిగ్గా కడగకపోయినా అది మూతలో సరిపోదు. ఇది కూడా చాలా త్వరగా లూజ్ అవ్వడానికి కారణం అవుతుంది.

కుక్కర్ రబ్బరును వేగంగా లాగడం లేదా మడతపెట్టడం వంటివి చేయకూడదు. ఇది కూడా త్వరగా లూజ్ అయ్యేలా చేస్తుంది. పిల్లలు దానితో ఆడుకోకుండా చూసుకోవాలి.

ఈ చిట్కాలను పాటించడం ద్వారా మీరు మీ ప్రెజర్ కుక్కర్ రబ్బరు ను ఎక్కువ కాలం ఉపయోగించవచ్చు. అదేవిధంగా వదులుగా ఉండే సమస్యను నివారించవచ్చు. రబ్బరును కడిగేటప్పుడు, నిల్వ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలని గుర్తుంచుకోండి. ఇలా చేయడం వల్ల మీ ప్రెజర్ కుక్కర్ ఎక్కువ కాలం పాటు చక్కగా పనిచేస్తుంది.