యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యకు బెస్ట్ హోం రెమెడీస్.. ఈ చిట్కాలు పాటిస్తే Uti సమస్యలు పరార్..

|

Jul 17, 2024 | 3:39 PM

ఈ సమస్యకు చికిత్సలో భాగంగా.. వైద్యులు దీనికి యాంటీబయాటిక్స్ సూచిస్తారు. యాంటీబయాటిక్స్ అనేవి సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధించే మందులు. ఈ కోర్సు ఐదు రోజులు వాడాల్సి ఉంటుంది. అయితే, మీ సమస్య పెద్దది కాకపోతే.. ఇంట్లోనే కొన్ని పద్ధతులను అనుసరించి.. ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యకు బెస్ట్ హోం రెమెడీస్.. ఈ చిట్కాలు పాటిస్తే Uti సమస్యలు పరార్..
Urinary Tract Infection
Follow us on

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది మహిళల్లో వచ్చే సర్వసాధారణమైన ఆరోగ్య సమస్య. ఇది ఒక రకమైన సాధారణ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లలో ఒకటి. దాదాపు 50 నుంచి 60శాతం మంది మహిళలు ఇలాంటి UTI సమస్యను అనుభవిస్తారు. ఆడవాళ్లలో ఎక్కువగా కనిపించే UTI సమస్య అనేది ప్రాణాంతక పరిస్థితి కానప్పటికీ.. తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ అనేక రకాలుగా ఇబ్బందికి గురిచేస్తుంది. పదే పదే మూత్రవిసర్జన చేయాలనే భావన కలుగుతుంది. మూత్రవిసర్జన చేసేటప్పుడు మంట, కడుపు నొప్పి కలిగిస్తుంది. ఈ సమస్యకు చికిత్సలో భాగంగా.. వైద్యులు దీనికి యాంటీబయాటిక్స్ సూచిస్తారు. యాంటీబయాటిక్స్ అనేవి సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధించే మందులు. ఈ కోర్సు ఐదు రోజులు వాడాల్సి ఉంటుంది. అయితే, మీ సమస్య పెద్దది కాకపోతే.. ఇంట్లోనే కొన్ని పద్ధతులను అనుసరించి.. ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

* నీరు.. ఆరోగ్యానికి ఒక వరంలా పనిచేస్తుంది. UTIతో సహా అన్ని ఆరోగ్య సమస్యలకు నీరు కీలక పరిష్కారం. హైడ్రేటెడ్‌గా ఉండడం వల్ల UTI సమస్యను తగ్గించుకోవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. తరచూ నీరు తాగడం వల్ల మూత్రం పలుచన అవుతుంది. దాంతో మీరు ఎక్కువగా మూత్ర విసర్జన చేసేలా సహాయం చేస్తుంది. ఇన్ఫెక్షన్‌ను ప్రేరేపించే బ్యాక్టీరియాను ఇది శరీరం నుంచి బయటకు పంపుతుంది. మన శరీరానికి సరిపడా మంచినీరు తాగడం యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యకు ఉత్తమ ఇంటి నివారణ.

* రెండు చెంచాల కొత్తిమీర గింజలను ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించి తాగాలి. ఈ డ్రింక్‌ని రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు తీసుకోవడం వల్ల యూటీఐ సమస్య నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

* బియ్యాన్ని బాగా కడిగి నీళ్లు పోసి గంటసేపు నానబెట్టాలి. ఈ నీటిని వడకట్టి తాగితే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ నుంచి త్వరగా ఉపశమనం పొందుతారు.

* యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే కొబ్బరి బొండాం నీరు రోజుకు ఒక్కసారైనా తీసుకుంటే ఇన్ఫెక్షన్ త్వరగా నయమవుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..