Side Effects of Tea: పని ఒత్తిడి నుంచి ఉపశమనం అంటూ తెగ టీ తాగేస్తున్నారా.. దంతాలకు ఎంత హానికరం అంటే..

భారతీయులు ఎక్కువ ఇష్టంగా తాగే పానీయం టీ.. మంచం మీదనే టీ తాగి రోజులో దినచర్య మొదలు పెట్టేవారున్నారు. భోజనం లేకపోయినా ఆలస్యం అయినా సరే ఒక్క టీ తాగితే చాలు అనే టీ ప్రియులున్నారు. టీ తాగకపోతే తలనొప్పి అంటూ కొంతమంది చెబుతారు. చాలా సార్లు టీ తాగే ప్రియులు పారాహుషార్.. ఈ అలవాటు ఆరోగ్యానికి మాత్రమే కాదు మీ దంతాలకు కూడా చాలా హానికరం..

Side Effects of Tea: పని ఒత్తిడి నుంచి ఉపశమనం అంటూ తెగ టీ తాగేస్తున్నారా.. దంతాలకు ఎంత హానికరం అంటే..
Side Effects Of Tea

Updated on: Dec 11, 2024 | 9:06 PM

ప్రజలు టీని ఎంతగా ఇష్టపడతారు అంటే ఉదయం మాత్రమే కాదు పని చేసే సమయంలో టీ, సంతోషంగా ఉన్నప్పుడు టీ, ఒత్తిడికి గురైనప్పుడు టీ తాగుతారు. అంటే మొత్తం మీద టీ తప్పనిసరిగా తీసుకుంటారు. అయితే ఈ టీని ఎక్కువ సార్లు తాగడం వలన ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అదే విధంగా ఈ విధంగా టీ తాగడం దంతాలకు కూడా చాలా హానికరం. ముఖ్యంగా పాలున్న టీ తాగడం మంచిది కాదు. టీ దంతాలకు ఎలా హానికరమో తెలుసుకుందాం..

పని ఒత్తిడి లేదా బద్ధకం నుంచి ఉపశమనం పొందేందుకు తరచుగా టీని ఆశ్రయిస్తారు. ఇలా నిద్రపోయే ముందు కూడా కొంతమందికి టీ తాగే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు నిద్ర లేమికి కారణం అవుతుంది. అంతేకాదు మానసిక స్థితిలో చిరాకు వంటి సమస్యలకు దారితీస్తుంది. ప్రస్తుతానికి టీ మీ దంతాలకు ఎలా హాని చేస్తుందంటే..

దంతాల పై పొరకు నష్టం

చాలా మందికి వేడి వేడి టీ తాగే అలవాటు ఉంటుంది. కొంచెం చల్లగా అయిన టీ అంటే ఇష్టపడరు. ఇటువంటి అలవాటు వల్ల దంతాల పై పొర అంటే ఎనామిల్ దెబ్బతింటుంది. దీని కారణం ఏమిటంటే దంతాల మీద ఎనామిల్ సున్నితంగా ఉంటుంది. కనుక అతి వేడిగా లేదా చల్లగా, తీపి లేదా పుల్లని ఏదైనా తిన్నప్పుడు దంతాలలో జలదరింపు అనుభూతి ప్రారంభమవుతుంది.

ఇవి కూడా చదవండి

మారిపోయే దంతాల రంగు

ప్రతిరోజూ ఎక్కువగా టీ తాగితే దంతాల సహజమైన తెల్లని రంగు పోయి..దంతాలు పసుపు రంగులోకి మారతాయి. ఇలా దంతాలు రంగు మారడానికి కారణం టానిన్ అనే మూలకం టీలో ఉండడమే.. ఇది దంతాలను పసుపు రంగును తీసుకురాగలదు లేదా దంతాల పైభాగంలో మరకలను సృష్టిస్తుంది.

నోటి దుర్వాసన

ఎక్కువగా టీ తాగితే దంతాల ఎనామిల్‌ను దెబ్బతినడమే కాదు నోటి పరిశుభ్రతపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. దీని కారణంగా బ్యాక్టీరియా వృద్ధి చెందడం వల్ల నోటి దుర్వాసన ఇబ్బంది పెడుతుంది. దీంతో ఇతరుల ముందు ఇబ్బంది పడవచ్చు.

కావిటీస్ ప్రమాదం

రోజులో ఎక్కువ సార్లు టీ తాగితే దంతాలపై మరకలు పడే అవకాశాలను పెంచుతుంది.అంతేకాదు ఎక్కువ స్వీట్ ఉన్న టీ తాగితే అది మరింత హానికరం. దీని వల్ల దంతాలలో పుచ్చు ఏర్పడటమే కాకుండా ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అంతేకాదు టీ ఎక్కువగా తాగడం వల్ల కాల్షియం శోషణలో ఆటంకం ఏర్పడి దంతాల దృఢత్వం తగ్గే అవకాశం ఉంది.

 

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను నేరుగా సంప్రదించండి.)