AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సమ్మర్‌లో చెరుకు పాలు తాగుతున్నారా..? శరీరంలో జరిగే మార్పులు తెలిస్తే..

ఎండాకాలంలో ఎక్కువగా కొబ్బరి బొండాలు, నిమ్మరసం, పుదీనా వాటర్‌, చెరుకు రసం అమ్ముడవుతుంటాయి. ఎందుకంటే.. వేసవి తాపం తీర్చుకునేందుకు గానూ ప్రజలు ఎక్కువగా చెరుకు రసం తీసుకుంటారు. ఇంతకీ చెరుకు రసం తీసుకోవటం వల్ల లాభామా..? నష్టమా.. ? పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోవాలంటే.. పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..

సమ్మర్‌లో చెరుకు పాలు తాగుతున్నారా..? శరీరంలో జరిగే మార్పులు తెలిస్తే..
Sugarcane Juice
Jyothi Gadda
|

Updated on: May 08, 2025 | 12:21 PM

Share

ఎండాకాలంలో ఎక్కువగా కొబ్బరి బొండాలు, నిమ్మరసం, పుదీనా వాటర్‌, చెరుకు రసం అమ్ముడవుతుంటాయి. ఎందుకంటే.. వేసవి తాపం తీర్చుకునేందుకు గానూ ప్రజలు ఎక్కువగా చెరుకు రసం తీసుకుంటారు. వేసవిలో ఎక్కువగా ఎండవేడిమితో శరీరంలోని ఎలెక్ట్రోలైట్స్ చెమట రూపంలో అధికంగా కోల్పోతుంటారు. దీంతో క్రమంగా శరీరం డీహైడ్రేషన్ సమస్యలకు గురవుతుంది. , గ్లూకోజ్ స్థాయిలు తగ్గుముఖం పడుతుంది. ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండేందుకు ప్రజలు ఎక్కువగా చెరుకు పాలను తీసుకుంటూ ఉంటారు. పైగా ఇందులో ఎటువంటి కొవ్వు పదార్ధాలు ఉండవు. సహజ సిద్దమైన తీపిని కలిగి ఉంటుంది. ఎటువంటి అదనపు కృత్రిమ స్వీటెనర్లను యాడ్‌ చేయరు. కాబట్టి సరైన మోతాదులో తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి మంచి మేలు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

చెరుకు రసం తాగడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. అలసట, మానసిక స్థితిని మెరుగుపరచడానికి వారానికి ఒక గ్లాసు చెరకు రసం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చెరకు రసంలో ఎలక్ట్రోలైట్ పొటాషియం ఉంటుంది. దీనిని తాగడం వల్ల శరీరానికి హైడ్రేషన్ లభిస్తుంది. వ్యాయామం తర్వాత అలసట నుండి ఉపశమనం పొందడానికి చెరకు పాలు తాగవచ్చు. దీనివల్ల శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అదనంగా, కండరాలలో బలం పునరుద్ధరించబడుతుంది. చెరకు రసం అనేది ప్రాసెస్ చేయని రసం. ఇందులో ఫినాలిక్, ఫ్లేవనాయిడ్ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. దీన్ని తాగడం వల్ల క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.

చెరుకు రసంలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇన్ఫెక్షన్లను నివారించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఇతర ఎలక్ట్రోలైట్‌లలో సమృద్ధిగా ఉంటాయి. వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి చెరకు రసం బెస్ట్‌ అంటున్నారు. చెరకు రసంలో పొటాషియం ఉంటుంది. ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్లను నిర్వహిస్తుంది. కాలేయం సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది. చెరకు రసంలో తక్కువ మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. ఇది శరీరంలో నీరు, ఎలక్ట్రోలైట్స్ లోపాన్ని నివారిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. చెరకు రసంలో కొలెస్ట్రాల్ మరియు సోడియం పూర్తిగా ఉండవు. దీనివల్ల మూత్రపిండాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
'నాకు చదువుకోవాలని ఉంది..' వేడుకుంటున్న బాలుడు!
'నాకు చదువుకోవాలని ఉంది..' వేడుకుంటున్న బాలుడు!
తప్పులన్నీ గంభీర్‌వి.. తిట్లన్నీ శ్రేయస్ అయ్యర్‌కా?
తప్పులన్నీ గంభీర్‌వి.. తిట్లన్నీ శ్రేయస్ అయ్యర్‌కా?
భార్యాభర్తల దగ్గర ఈ సర్టిఫికేట్ ఉండాల్సిందే.. లేదంటే..
భార్యాభర్తల దగ్గర ఈ సర్టిఫికేట్ ఉండాల్సిందే.. లేదంటే..
6 బ్యాంకులకు భారీ జరిమానా.. మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన RBI
6 బ్యాంకులకు భారీ జరిమానా.. మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన RBI
పంట పొలంలో నాగలికి తాకి బయటపడ్డ బంగారపు నిధులు.. ఆ తర్వాత
పంట పొలంలో నాగలికి తాకి బయటపడ్డ బంగారపు నిధులు.. ఆ తర్వాత
మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు,రైల్లోనే కిచెన్ ఓపెన్ చేసి నానా రచ్చ
మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు,రైల్లోనే కిచెన్ ఓపెన్ చేసి నానా రచ్చ
చావు అంచుల నుంచి మత్స్యకారులను కాపాడిన కోస్డ్ గార్డ్!
చావు అంచుల నుంచి మత్స్యకారులను కాపాడిన కోస్డ్ గార్డ్!
అప్పట్లో వేప చెట్టు కింద కూర్చొని ఈ వడలనే తినేవాళ్లు.. భలే చలువ
అప్పట్లో వేప చెట్టు కింద కూర్చొని ఈ వడలనే తినేవాళ్లు.. భలే చలువ
ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే..
ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే..
మహిళలకు ఇది కదా కావాల్సింది..ఒక్క రోజులోనే భారీగా పడిపోయిన బంగారం
మహిళలకు ఇది కదా కావాల్సింది..ఒక్క రోజులోనే భారీగా పడిపోయిన బంగారం