Teeth White: దంతాలపై పసుపు రంగు పోయి తెల్లగా మెరవాలా..!

మనిషిలో ముందు ఆకర్షణగా కనిపిచేంది నవ్వు. ప్రస్తుతం చాలా మంది దంతాలకు సంబంధించిన సమస్యలతో ఇబ్బందులను ఎందుర్కొంటున్నారు. దీంతో నలుగురిలో నవ్వేందుకు ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. రోజుకు రెండు సార్లు బ్రష్ చేసినా పసుపు రంగులోనే ఉంటాయి. ఇందుకు పోషకాహార లోపమని అంటున్నారు నిపుణులు. చిగుళ్లలో వచ్చే వాపు, సంక్రమణ వల్ల ఇలా దంతాలు రంగు మారి కనిపిస్తూ ఉంటాయి. క్యాల్షియం లోపం కారణంగా కూడా పసుపు రంగులోకి..

Teeth White: దంతాలపై పసుపు రంగు పోయి తెల్లగా మెరవాలా..!
Teeth Whitening Tips
Follow us
Chinni Enni

|

Updated on: Apr 12, 2024 | 7:37 PM

మనిషిలో ముందు ఆకర్షణగా కనిపిచేంది నవ్వు. ప్రస్తుతం చాలా మంది దంతాలకు సంబంధించిన సమస్యలతో ఇబ్బందులను ఎందుర్కొంటున్నారు. దీంతో నలుగురిలో నవ్వేందుకు ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. రోజుకు రెండు సార్లు బ్రష్ చేసినా పసుపు రంగులోనే ఉంటాయి. ఇందుకు పోషకాహార లోపమని అంటున్నారు నిపుణులు. చిగుళ్లలో వచ్చే వాపు, సంక్రమణ వల్ల ఇలా దంతాలు రంగు మారి కనిపిస్తూ ఉంటాయి. క్యాల్షియం లోపం కారణంగా కూడా పసుపు రంగులోకి మారతాయి. అలాగే కాలేయంలో ఉండే సమస్యల కారణంగా కూడా రంగు మారతాయి దంతాలు. అదే విధంగా కూల్ డ్రింక్స్, సోడా, టీ, కాఫీలు అధికంగా తాగడం, స్మోకిగ్ చేయడం వల్ల కూడా పళ్లు కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి. వీటిల్లో ఉండే కెమికల్స్ దంతాల ఎనామిల్‌ను దెబ్బ తీస్తుంది. దంతాలు తెల్లగా మిలమిలా మెరవాలంటే కొన్ని రకాల చిట్కాలు పాటించాల్సిందే. అవేంటో ఇప్పుడు చూద్దాం.

నిమ్మ ఉప్పు – బేకింగ్ సోడా:

ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాలో ఒక స్పూన్ నిమ్మ ఉప్పు లేదా నిమ్మరసం కలపాలి. దీన్ని టూత్ బ్రష్ తీసుకుని.. కాసేపు సున్నితంగా తోమాలి. ఓ రెండు నిమిషాల తర్వాత నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పళ్లు తెల్లగా మారడమే కాకుండా.. దుర్వాసన తగ్గుతుంది.

కొబ్బరి నూనెతో మసాజ్:

కొబ్బరి నూనెతో కూడా దంతాలను తెల్లగా మార్చవచ్చు. కొద్దిగా కొబ్బరి నూనె తీుకుని.. దంతాలకు బాగా పట్టించండి. ఆ తర్వాత నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల దంతాల్లో ఉండే బ్యాక్టీరియా తొలగి.. తెల్లగా మారతాయి.

ఇవి కూడా చదవండి

ఆరెంజ్ తొక్క:

ఆరెంజ్ పండ్లను తిన్న తర్వాత తొక్కలను పడేయకుండా.. ఎండలో ఆరబెట్టండి. ఆ తర్వాత గ్రైండ్ చేసి పౌడర్‌లా తయారు చేసుకోవాలి. దీనికి నీళ్లు కలిపి.. బ్రష్‌తో దంతాలను బాగా రుద్దాలి. ఇలా రోజూ చేస్తే దంతాలు తెల్లగా మారతాయి.

గుడ్డు పెంకులు:

గుడ్డు పెంకులతో కూడా పళ్లను తెల్లగా మార్చుకోవచ్చు. ఎగ్ షెల్‌ను శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టండి. ఆ తర్వాత దీన్ని మిక్సీలో వేసి పౌడర్‌లా తయారు చేయాలి. ఈ పౌడర్‌తో దంతాలను తోముకుంటే.. పళ్లు తెల్లగా వస్తాయి. ఆ తర్వాత మరో పేస్ట్‌తో పళ్లను శుభ్రం చేసుకోండి. ఇలా ఈ టిప్స్‌ని అప్పుడప్పుడూ పాటిస్తే.. పళ్లు తెల్లగా మారతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..