ఈ రోజుల్లో అమ్మాయిలు, అబ్బాయిలు ఎక్కడికి వెళ్లిన షూస్ ధరించి వెళ్తుంటారు. రకరకాల డిజైన్లలో నచ్చిన రంగుల్లో షూస్ ధరిస్తారు. ముఖ్యంగా తెల్ల రంగు బూట్లు ఒక్కసారి ధరించగానే మురికిగా కనిపిస్తాయి. ట్రెండీ వైట్ షూస్ చాలా మంది ప్రధమ ఎంపిక. ఎందుకంటే అవి ప్రతి డ్రెస్‌తో మ్యాచ్ అవులాయి. బాలీవుడ్ ప్రముఖుల నుంచి టీవీ నటుల వరకు ప్రతి ఒక్కరి ఫ్యాసన్ సీక్రెట్ తెల్ల రంగు షూలు. కానీ అవి ధుమ్ముధూళి కారణంగా త్వరగా మాసిపోతుంటాయి. వీటిని ఎలా శుభ్రం చేయాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడిపోతుంటారు. ఈ కింద సూచించిన టిప్స్ ఫాలో అయ్యారంటే చిటికెలో మీ బూట్ల మురికి వదిలిపోతుంది. అవేంటో తెలుసుకుందాం..
బేకింగ్ సోడా, వెనిగర్ వీటి మిశ్రమం షూలను శుభ్రపరచడంలో బాగా పనిచేస్తాయి. ఈ రెండింటినీ కలిపిన నీళ్లలో షూ వేసి శుభ్రం చేస్తే దుర్వాసన, ఫంగస్ త్వరగా నివారించవచ్చు. ఎలా శుభ్రం చేయాలంటే.. ఒక గిన్నెలో అర టీస్పూన్ వెనిగర్, పావు కప్పు బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకోవాలి. నురుగు వచ్చే వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని బ్రష్‌తో షూస్‌పై అప్లై చేసి కాసేపు అలాగే ఉంచాలి. తర్వాత నీళ్లతో శుభ్రం చేస్తే సరి.
టూత్‌పేస్ట్ దంతాలను తెల్లగా శుభ్రం చేయడతోపాటు షూ కూడా శుభ్రం చేస్తుంది. ముందుగా షూలను క్లాత్‌తో శుభ్రం చేసి తర్వాత నీళ్లలో నానబెట్టాలి. ఆ తర్వాత టూత్‌బ్రష్‌తో పేస్ట్‌ను అప్లై చేసి 10 నిముషాలు అలాగే ఉంచాలి. తర్వాత పాత టూత్ బ్రష్ తో రుద్ది నీళ్లతో కడిగేయాలి. బూట్లు తళతళ లాడుతాయి.
నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ బూట్లను శుభ్రం చేయడంలో సహాయపడుతుంది. షు నుంచి వచ్యే చెడు వాసనలను కూడా తొలగిస్తుంది. నీళ్లలో ఒక నిమ్మకాయ పిండి.. షూ నిమ్మ నీళ్లలో నానబెట్టాలి. 10 నిమిషాల తర్వాత చేతితో నెమ్మదిగా రుద్ది నీళ్లలో కడిగి ఎండలో ఆరబెట్టాలి.
నెయిల్ పెయింట్ రిమూవర్ సహాయంతో లెదర్ షూస్ లేదా వైట్ స్నీకర్లపై గీతలు సులభంగా శుభ్రం చేయవచ్చు. ముందుగా కాటన్ బాల్‌ను అసిటోన్ రిమూవర్‌లో ముంచి, మరకలున్న చోట రుద్దాలి. మరకలు తొలగించిన తర్వాత బూట్లపై పౌడర్ లేదా పెట్రోలియం జెల్లీని పూయాలి.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.