Water Side Effects: నిద్ర లేవగానే నీళ్లు తాగే వారికి షాకింగ్‌ న్యూస్‌.. ఆ సమస్యలు తప్పవని నిపుణుల హెచ్చరిక

|

Jul 17, 2023 | 7:00 PM

ముఖ్యంగా ఉదయాన్నే లేచి నీరు తాగడం సుఖ విరోచనం అవ్వడంతో పాటు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని చాలా మంది నిపుణులు చెబుతూ ఉంటారు. వారి సూచనలకు అనుగుణంగా చాలామంది ఉదయాన్నే లేవగానే నీరు తాగడం అలవాటు చేసుకున్నారు. అయితే తాజాగా ఆరోగ్య నిపుణులు ఓ షాకింగ్‌ విషయం వెల్లడించారు. ఉదయాన్నే లేచిన వెంటనే నీరు తాగితే అనేక ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుందని వెల్లడించారు.

Water Side Effects: నిద్ర లేవగానే నీళ్లు తాగే వారికి షాకింగ్‌ న్యూస్‌.. ఆ సమస్యలు తప్పవని నిపుణుల హెచ్చరిక
Drinking Water
Follow us on

మనల్ని మనం ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉంచుకోవాలని చాలా మంది కోరుకుంటూ ఉంటారు. అయితే అధికంగా నీటిని తాగితే జీర్ణ క్రియతో పాటు వివిధ సమస్యలు దూరం అవుతాయని చాలా మంది చెబుతూ ఉంటారు. ముఖ్యంగా ఉదయాన్నే లేచి నీరు తాగడం సుఖ విరోచనం అవ్వడంతో పాటు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని చాలా మంది నిపుణులు చెబుతూ ఉంటారు. వారి సూచనలకు అనుగుణంగా చాలామంది ఉదయాన్నే లేవగానే నీరు తాగడం అలవాటు చేసుకున్నారు. అయితే తాజాగా ఆరోగ్య నిపుణులు ఓ షాకింగ్‌ విషయం వెల్లడించారు. ఉదయాన్నే లేచిన వెంటనే నీరు తాగితే అనేక ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుందని వెల్లడించారు. ముఖ్యంగా శరీర జీవక్రియకు చాలా నష్టం చేస్తుందని పేర్కొంటున్నారు. ఆయుర్వేద వైద్యులు ఉదయాన్నే నీటిని తాగే బదులుగా ఉష్ణపన్‌ అనే విధానాన్ని పాటించాలని సూచిస్తున్నారు. ఆయుర్వేద నిపుణులు సూచించే ఆ విషయాలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

చాలా మంది ఉదయాన్నే లేవగానే ఎక్కువగా నీరు తాగేస్తూ ఉంటారు. అయితే ఇలా చేస్తే జీవక్రియకు చాలా కీడు చేసినట్టేనని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఇలా చేయడం వల్ల కాలేయ పనితీరు బాగా దెబ్బతింటుంది. అంతేకాదు మూత్రపిండాలతో పాటు మెదడు కణాలపై ఒత్తిడి కలిగిస్తుంది. ముఖ్యంగా మెదడు కాండంపై తీవ్ర ప్రభావం చూపి కేంద్ర నాడీ వ్యవస్థకు చేటు చేస్తుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఉదయాన్నే లేవగానే ఓ చిన్న గ్లాసు గోరువెచ్చని నీరు తాగాలని సూచిస్తున్నారు. నీటిని ఎక్కువ తాగడం వల్ల మంచిదే అయినా ఉదయాన్నే తాగకూడదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే ఒక్కోసారి దాహం వల్ల మెలకువ వస్తుందని, ఆ సమయంలో నీరు తాగితే పర్లేదని సూచిస్తున్నారు. అలాగే నీటిని ఎలా తాగాలో కూడా చెబుతున్నారు. వారు సూచించే మార్గాలను తెలుసుకుందాం.

నీటిని ఇలా తాగితే మేలు

చాలా మంది నిలబడి నీరు తాగుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మూత్రపిండాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అలాగే ఆర్థరైటిస్‌ సమస్య కూడా వేధించే అవకాశం ఉంది. సాధారణంగా నిలబడి నీరు తాగడం వల్ల నరాలు ఉద్రిక్తతకు లోనవుతాయి. కాబట్టి కూర్చొని నీరు తాగడం శ్రేయస్కరమని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ముఖ్యంగా మద్యపానం సమయంలో కూడా కచ్చితంగా కూర్చొనే తాగాలని పేర్కొంటున్నారు. అలాగే కూలింగ్‌ వాటర్‌ను వీలైనంత తక్కువ తీసుకోవాలి. రూమ్‌ టెంపరేచర్‌ నీటిని తీసుకోవడం మంచిది. ముఖ్యంగా ఉదయం సమయంలో తప్పనిసరిగా నీళ్లు తాగాల్సి వస్తే కూలింగ్‌ వాటర్‌ను దూరం పెడితే మంచిది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..