Tattoo: టాటూ లవర్స్‌కి షాకింగ్ న్యూస్‌.. ఎండ తగిలితే అంతే సంగతులు.. పరిశోధనల్లో షాకింగ్ విషయాలు..

|

Aug 25, 2022 | 3:54 PM

Cancer: కొంత మంది టాటూలను అమితంగా ఇష్టపడుతుంటారు. తమకు నచ్చిన వ్యక్తుల పేర్లను లేదా తమ పేర్లను ఒంటిపై పచ్చబొట్టుగా వేసుకుంటుంటారు. టాటూ జీవితకాలం మనతోనే ఉండిపోతుందని భావిస్తుంటారు. అయితే అలాంటి..

Tattoo: టాటూ లవర్స్‌కి షాకింగ్ న్యూస్‌.. ఎండ తగిలితే అంతే సంగతులు.. పరిశోధనల్లో షాకింగ్ విషయాలు..
Tatto
Follow us on

Tattoo: కొంత మంది టాటూలను అమితంగా ఇష్టపడుతుంటారు. తమకు నచ్చిన వ్యక్తుల పేర్లను లేదా తమ పేర్లను ఒంటిపై పచ్చబొట్టుగా వేసుకుంటుంటారు. టాటూ జీవితకాలం మనతోనే ఉండిపోతుందని భావిస్తుంటారు. అయితే అలాంటి వారికే అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు ఓ షాకింగ్ విషయాన్ని చెప్పారు. టాటూల ఇంక్‌పై చేసిన అధ్యయనాల్లో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. టాటూల కోసం ఉపయోగించే ఇంక్‌ల్లో క్యాన్సర్‌కు కారణమయ్యే రసాయనంగా మారే పదార్థం ఉందని శాస్ర్తవేత్తలు గుర్తించారు. ఇందులో భాగంగా స్టేట్‌ యూనివర్సిటీ ఆఫ్‌ న్యూయార్క్‌కు చెందిన సైంటిస్ట్‌ స్వియర్క్‌ నేతృత్వంలో దాదాపు 100 టాటూ ఇంక్‌లను విశ్లేషించారు.

టాటూలు ఎప్పటికీ తొలిగి పోకుండా శరీరంపై ఉండడానికి ఇంక్‌లలో ఉండే పిగ్మెంట్, క్యారియర్ సొల్యూషన్‌ కారణం. శాస్త్రవేత్తలు విశ్లేషించిన 100 ఇంక్‌ల్లో 23 ఇంక్‌ల్లో అజో అనే పదార్థం కలిగిన రంగు ఉనికికి గుర్తించారు. సాధారణంగా అజో సింథటిక్‌ రంగులను ఆహారం, బ్యూటీ, దుస్తుల తయారీలో ఉపయోగిస్తుంటారు. ఇవి రసాయనికంగా చెక్కు చెదరకుండా ఉన్నప్పుడు సురక్షితంగానే ఉన్నా.. బ్యాక్టీరియాతో, లేదా యూవీ కిరణాలు, లేదా అధిక సూర్య రక్ష్మికి తగిలితే క్యాన్సర్‌ కలిగించే సమ్మేళనంగా మారుతాయని అధ్యయనంలో వెల్లడైంది.

అంతేకాకుండా టాటూ వేసే సమయంలో పరికరాలను సరిగ్గా శుభ్రం చేయకపోతే చర్మం చీలడం, కామెర్లు వంటి రక్తంతో సక్రమించే వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. టాటూలోని అజో సమ్మేళనాలు ఎక్కువ ఎండకు ఎక్స్‌పోజ్‌ అయినా, అధిక బ్యాక్టీరియాకు గురైనా ‘క్యాన్సర్‌ కారకంగా’ మారే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..