Rain Precautions: భారీ వర్షాల్లో తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు

|

Jul 22, 2023 | 8:31 PM

భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు సతమతమవుతున్నారు. తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా..

Rain Precautions: భారీ వర్షాల్లో తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు
safety precautions during heavy rains
Follow us on

భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు సతమతమవుతున్నారు. తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అవేంటో ఓసారి చూసేద్దాం..

-భారీ వర్షాలతో ఎక్కడిక్కడ రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో అత్యవసరం అయితే తప్ప బయటకు రాకపోవడమే మంచిది.
-మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కాలువలు, కల్వర్టుల వద్ద నీరు పొంగిపొర్లుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కాలువలు దాటే సాహసం చేయకపోవడం ఉత్తమం.
-ఇంటి పరిసరాల్లో ఉన్న విద్యుత్ స్తంభాలు, వైర్లకు దూరంగా ఉండాలి. ఇలాంటి సమయాల్లో కరెంట్ షాక్ కొట్టే ప్రమాదాలు చాలా ఎక్కువ.
-భారీ వర్షాలతో పాటు పిడుగులు కూడా పడుతున్నాయి. కాబట్టి చెట్ల కింద, గోడల పక్కన ఉండటం మంచిది కాదు.
-రోడ్లు సరిగా లేవు కదా అని కొత్త దారుల్లో వెళ్లకపోవడం శ్రేయస్కరం. ఎందుకంటే ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉంటాయో తెలీదు కాబట్టి.. మీరు వెళ్లే మార్గంలోనే జాగ్రత్తగా వెళ్లడం మంచింది.
-వర్షాలు పడుతున్నప్పుడు పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. పిల్లలు బయట ఆడుకోవడానికి ఇష్టపడతారు. కానీ ఈ సమయంలో బటయకు పంపకపోవడమే మేలు.
-అత్యవసర సమయాల్లో 100 నెంబర్ కు ఫోన్ చేయడం అవసరం. మీరు లేదా మీకు తెలిసిన వారు ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా వెంటనే అత్యవసర నెంబర్ కు ఫోన్ చేయాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..