AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సబ్జా సీడ్స్ vs చియా సీడ్స్.. వానాకాలంలో మీ కడుపుకు ఏది మంచిది..?

Sabja Seeds vs Chia Seeds: ఈ వానాకాలంలో జీర్ణశక్తి మందగించి గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు కూడా ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటి సమయంలో మన శరీరాన్ని లోపలి నుండి చల్లబరిచి, ఆరోగ్యంగా ఉంచేందుకు సబ్జా గింజలు, చియా సీడ్స్ అద్భుతంగా పని చేస్తాయి. అయితే పైకి ఒకేలా కనిపించే ఈ రెండింటిలో... ప్రస్తుత వాతావరణానికి మన శరీరానికి ఏది ఎక్కువ మేలు చేస్తుంది? అనేది తెలుసుకుందాం..

సబ్జా సీడ్స్ vs చియా సీడ్స్.. వానాకాలంలో మీ కడుపుకు ఏది మంచిది..?
Sabja Seeds Vs Chia Seeds
Krishna S
|

Updated on: Jul 08, 2026 | 7:15 AM

Share

వానాకాలం సీజన్ మొదలైందంటే చాలు.. వాతావరణంలో మార్పులు, కాస్త తేమ, ఉక్కపోత వల్ల మన జీర్ణవ్యవస్థ కాస్త మందగిస్తుంది. దీనివల్ల కడుపులో గ్యాస్, ఎసిడిటీ, శరీరం లోపల వేడి చేయడం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇలాంటి సమయంలో మనల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సబ్జా గింజలు, చియా సీడ్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే చాలామంది ఈ రెండింటినీ ఒకటిగానే భావిస్తుంటారు. ఈ వానాకాలంలో మీ శరీరానికి ఏది ఎక్కువ మేలు చేస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

వేడిని తగ్గించే సబ్జా

సాధారణంగా సబ్జా గింజలను శతాబ్దాలుగా మన సాంప్రదాయ వైద్యంలో శరీర వేడిని, కడుపులో మంటను తగ్గించడానికి ఉపయోగిస్తున్నారు. ఇవి నీటిలో వేయగానే చాలా వేగంగా, కేవలం 10 నుండి 15 నిమిషాల్లోనే నానిపోతాయి. ఇవి తమ బరువు కంటే దాదాపు 15 రెట్లు ఎక్కువ నీటిని పీల్చుకుని, జెల్ లాగా మారుతాయి. వానాకాలంలో వచ్చే ఉక్కపోతకు శరీరాన్ని తక్షణమే చల్లబరచడానికి, జీర్ణక్రియను తేలికగా మార్చడానికి సబ్జా గింజలు అద్భుతంగా పనిచేస్తాయి. వీటిని నిమ్మకాయ నీళ్లు లేదా కొబ్బరి నీళ్లలో కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

చియా సీడ్స్..

మరోవైపు చియా సీడ్స్ అనేవి పోషకాల గని అని చెప్పవచ్చు. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, ఐరన్, మెగ్నీషియం, పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి నానడానికి సబ్జా గింజల కంటే కాస్త ఎక్కువ సమయం తీసుకుంటాయి. చియా సీడ్స్ శరీరానికి స్థిరమైన శక్తిని ఇవ్వడానికి, బరువును అదుపులో ఉంచడానికి, గుండె ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడతాయి. వీటిని సాధారణంగా స్కూతీలు, ఓట్స్ లేదా పుడ్డింగ్‌లలో ఎక్కువగా వాడుతుంటారు.

ఈ వానాకాలం సీజన్‌లో ఏది ఎంచుకోవాలి అనే విషయానికి వస్తే.. మీ ప్రాధాన్యతను బట్టి నిర్ణయించుకోవాలి. ఒకవేళ మీకు ఈ సీజన్ వల్ల కడుపులో ఉబ్బరం, ఎసిడిటీ లేదా వేడి చేసినట్లు అనిపిస్తే, కడుపును తేలికగా ఉంచే సబ్జా గింజలు బెస్ట్ ఛాయిస్ అవుతాయి. అలా కాకుండా వర్షాల వల్ల శారీరక శ్రమ తగ్గి బరువు పెరగకుండా ఉండాలన్నా, రోజంతా యాక్టివ్‌గా ఉండటానికి పోషకాలు కావాలన్నా చియా సీడ్స్ ఉపయోగపడతాయి. అయితే వానాకాలంలో జీర్ణశక్తి కాస్త తక్కువగా ఉంటుంది కాబట్టి చియా సీడ్స్ వాడేటప్పుడు వాటిని పూర్తిగా నానబెట్టిన తర్వాతే తీసుకోవడం మంచిది.

Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి