Beauty Tips: వేసవిలో సాఫ్ట్ స్కిన్ కోసం గులాబీలతో రకరకాల ఫేస్‌ప్యాక్‌లు..ఇలా వాడితే రెట్టింపు అందం!

|

Apr 19, 2024 | 12:01 PM

గులాబీ రేకుల్లో చర్మ ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ ఇ, విటమిన్ కె పుష్కలంగా ఉండడమే. అందుకే ఇది అందమైన చర్మానికి అద్భుత ఔషధంగా చెబుతారు. వేసవి కాలంలో రోజ్ వాటర్‌తో తయారు చేసిన ఫేస్ ప్యాక్ అనేక చర్మ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, ఏ రకమైన చర్మ సమస్యలకు ఏ ఫేస్ ప్యాక్ మంచిది..అనే విషయాలను ఇక్కడ  తెలుసుకుందాం...

Beauty Tips: వేసవిలో సాఫ్ట్ స్కిన్ కోసం గులాబీలతో రకరకాల ఫేస్‌ప్యాక్‌లు..ఇలా వాడితే రెట్టింపు అందం!
Rose Water Face Packs
Follow us on

రోజ్ వాటర్ మంచి సౌందర్య సాధనం. అందుకే ప్రాచీన కాలం నుంచి చర్మ సంబంధిత సమస్యలకు గులాబీ రేకులను ఉపయోగిస్తున్నారు. అంతే కాదు మహారాణి యువరాణులకు గులాబీ నీళ్లతో స్నానం చేయించేవారు. దీనికి ప్రధాన కారణం గులాబీ రేకుల్లో చర్మ ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ ఇ, విటమిన్ కె పుష్కలంగా ఉండడమే. అందుకే ఇది అందమైన చర్మానికి అద్భుత ఔషధంగా చెబుతారు. వేసవి కాలంలో రోజ్ వాటర్‌తో తయారు చేసిన ఫేస్ ప్యాక్ అనేక చర్మ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, ఏ రకమైన చర్మ సమస్యలకు ఏ ఫేస్ ప్యాక్ మంచిది..అనే విషయాలను ఇక్కడ  తెలుసుకుందాం…

రోజ్ వాటర్-శ్రీగంధ:

మీ చర్మం జిడ్డుగా (ఆయిలీ స్కిన్) మొటిమలు ఎక్కువగా ఉన్నట్లయితే ఒక చెంచా రోజ్ వాటర్, అర చెంచా గంధపు పొడి, అర చెంచా గులాబీ రేకుల పొడి మిక్స్ చేసి ముఖానికి రాసుకోవాలి. ఇది చర్మంలోని జిడ్డును తొలగిస్తుంది. మొటిమలను త్వరగా నయం చేస్తుంది.

ఇవి కూడా చదవండి

గులాబీ, పాలు:

రెండు గులాబీ రేకులను గ్రైండ్ చేసి, వాటిని అరకప్పు పాలలో 30 నిమిషాలు నానబెట్టి, పేస్ట్ లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చర్మంపై స్మూత్‌గా మర్ధన చేసుకుంటూ ప్యాక్‌లా అప్లై చేసుకోవాలి. పూర్తిగా ఆరిన తర్వాత చల్లటి నీటితో స్నానం చేస్తే చర్మం మృదువుగా మారుతుంది.

గులాబీలు, ఓట్స్:

గులాబీ రేకులను నీటిలో అరగంట నానబెట్టి, ఆపై రెండు స్పూన్‌ల ఓట్స్‌ వేసి గ్రైండ్ చేసుకోవాలి. మెత్తటి మిశ్రమం తయారు చేసుకుని దాన్ని ఫేస్‌ అంతటా చక్కగా ప్యాక్‌లా అప్లై చేసుకోవాలి. సుమారు 20 నిమిషాల పాటు బాగా ఆరిన తర్వాత మీ ముఖాన్ని కడుక్కోండి. దీంతో డెడ్ స్కిన్ సమస్య తొలగిపోతుంది. చర్మం మెరుస్తూ కనిపిస్తుంది.

గులాబీ, గోధుమ రవ్వ మాస్క్:

2 చెంచాల గులాబీ పువ్వు పొడి, 1 చెంచా గోధుమ రవ్వ, రెండు చెంచాల పాలు తీసుకుని నానబెట్టి బాగా మిక్స్‌ చేసుకోవాలి. మొత్తటి ఈ ప్యాక్‌ని మీ ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి. దీంతో బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు.

గులాబీ, శెనగ పిండి:

ఒక చెంచా శెనగ పిండిలో అర చెంచా పెరుగు, కొద్దిగా తేనె, ఒక చెంచా గులాబీ రేకుల పొడి కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత మంచినీటితో ముఖం కడుక్కోవాలి. ఇది చర్మంపై ఏర్పడ్డ మచ్చలు, దద్దుర్లు నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..