ప్రసుత్తం ఎక్కువ మంది గ్రీన్ టీని తాగడానికి ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా ఎక్కువ మంది సన్నబడటానికి తాగుతున్నారు. ఎందుకంటే గ్రీన్ టీ బరువు తగ్గడంలో సహాయపడుతుందని నమ్మకం. అంతేకాదు ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి అలాగే చర్మానికి మేలు చేస్తాయి. అంతే కాదు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, అనేక రకాల పోషకాలు ఇందులో లభిస్తాయి.
గ్రీన్ టీ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు జరుగుతుంది. అయితే దీనిని త్రాగడానికి సరైన మార్గం, మంచి సమయం గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. నిజానికి గ్రీన్ టీని తప్పు మార్గంలో లేదా సరైన సమయంలో వినియోగించనట్లయితే..అది ప్రయోజనాలకు బదులుగా ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. అందువల్ల ఎవరైనా బరువు తగ్గడం కోసం గ్రీన్ టీ తాగుతున్నట్లయితే, దానిని త్రాగడానికి సరైన సమయం, మార్గం తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ఆయుర్వేద నిపుణుడు కిరణ్ గుప్తా ఈ విషయంపై మాట్లాడుతూ ఏదైనా తిన్న తర్వాత టీకి బదులుగా.. నిమ్మకాయ లేదా ఉసిరికాయతో చేసిన గ్రీన్ టీ తాగితే అది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే శరీరం స్వభావం, ఆరోగ్య స్థితిని బట్టి ప్రతిరోజూ గ్రీన్ టీని త్రాగాలి. ఉదాహరణకు ఎసిడిటీ సమస్య ఉన్నట్లయితే ఖాళీ కడుపుతో గ్రీన్ టీని త్రాగకూడదు. ఎందుకంటే అప్పుడు ఆ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. అయితే గ్రీన్ టీ తాగితే పడేవారు అసిడిటీ సమస్య లేనివారు, మంచి జీర్ణశక్తి ఉన్నవారు గ్రీన్ టీలో ఉసిరి లేదా నిమ్మరసం కలిపి ఖాళీ కడుపుతో తీసుకోవచ్చు.
ఎవరైనా అసిడిటీ సమస్యతో ఇబ్బంది పడుతుంటే వాళ్లు పండ్లు లేదా అల్పాహారం తీసుకున్న 30 నిమిషాల తర్వాత గ్రీన్ టీ తాగవచ్చు. అయితే ఎవరి ఆరోగ్య పరిస్థితి, శరీర స్వభావాన్ని బట్టి గ్రీన్ టీని తాగాలి. ఇందులో కెఫిన్ ఉంటుంది.. కనుక రాత్రి సమయంలో తాగవద్దు. అంతేకాదు పగలు కూడా ఎక్కువ మోతాదులో తాగరాదు.
చాలా మంది బరువు తగ్గడానికి గ్రీన్ టీ తాగుతారు. అయితే ఒక్క గ్రీన్ టీ తాగితేనే సరిపోదు. దీనితో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లను అలవర్చుకోవడం చాలా ముఖ్యం. అందువల్ల ప్రతిరోజూ 25 నుంచి 30 నిమిషాల వ్యాయామం చేయవచ్చు. యోగా, స్ట్రెచింగ్, వ్యాయామం లేదా జుంబా డ్యాన్స్ వంటి కార్యకలాపాలను చేయవచ్చు. అంతేకాదు శరీర అవసరాలకు అనుగుణంగా తగినంత నీరు త్రాగటం కూడా చాలా ముఖ్యం. అనారోగ్యకరమైన, వేయించిన , కారంగా ఉండే ఆహారాన్ని తీసుకోవద్దు. సమతుల్య ఆహారం తీసుకోవాలి. గ్రీన్ టీ ఎప్పుడు, ఎలా తాగాలి, బరువు తగ్గడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే విషయాల గురించి ముందుగా నిపుణులతో మాట్లాడి తెలుసుకోవాలి. శరీర అవసరాలకు అనుగుణంగా గ్రీన్ టీ తాగే విషయంలో అతను మీకు సరైన సలహా ఇస్తాడు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..