బియ్యం కడిగిన నీళ్లలో ఇది నాలుగు చుక్కలు కలిపి రాసుకుంటే… జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది!

|

Aug 20, 2024 | 6:48 PM

ఇది జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది. ఈ మిశ్రమాన్ని తల మీద స్ప్రే చేసి, స్మూత్‌గా మసాజ్ చేసుకోవాలి. మంచి ఫలితాల కోసం రాత్రంతా అలాగే వదిలేయండి. ఆ మర్నాడు వాష్‌ చేసుకోవాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తూ ఉండటం వల్ల త్వరలోనే సిల్కీ, లాంగ్‌ హెయిర్‌ను పొందగలరు. మీకు ఏదైనా ఫలితం కనిపించాలంటే మీరు రెగ్యులర్‌గా దీన్ని అప్లై చేయాలి.

బియ్యం కడిగిన నీళ్లలో ఇది నాలుగు చుక్కలు కలిపి రాసుకుంటే... జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది!
Rice Water For Hair
Follow us on

మనలో పోషకాహార లోపం వల్లే జుట్టు నిర్జీవంగా, పొడిబారిపోయినట్టుగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. జుట్టు సమస్యలను నివారించేందుకు కెమికల్‌ ఆధారిత చికిత్సలతో లాభం కంటే, నష్టాలే ఎక్కువగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే జుట్టు సమస్యలను ఇంటి నివారణలతో పరిష్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు. ఇంటి చిట్కాలలో బియ్యం నీటిని వాడటం వల్ల జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుందని చెబుతున్నారు. బియ్యం నీటిని జుట్టుకు రకరకాలుగా అప్లై చేయవచ్చు. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. జుట్టుకు మెరుపును ఇస్తుంది. ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం…

జుట్టుకు వాడే నీటిని తయారు చేయటం కోసం బియ్యాన్ని నానబెట్టడం, ఉడకబెట్టడం లేదా పులియబెట్టడం ద్వారా బియ్యం నీటిని తయారు చేస్తారు. దీన్ని జుట్టుకు అప్లై చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వెంట్రుకల పెరుగుదలకు బియ్యం నీరు సహాయపడుతుంది. బి, సి, ఇ, కె విటమిన్లు బియ్యం నీటిలో పుష్కలంగా లభిస్తాయి. ఇది ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. బియ్యం నీటిలో అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లకు మంచి మూలం. ఇది జుట్టు నష్టాన్ని తగ్గిస్తుంది. చుండ్రు, జిడ్డుగల జుట్టు, తలలో దురద నుండి ఉపశమనం కలిగిస్తుంది.

బియ్యం నీటిని తయారు చేయడానికి సులభమైన మార్గం ఒక గిన్నెలో గ్లాసు బియ్యం తీసుకుని శుభ్రం కడగాలి. అందులో రెండు గ్లాసుల నీళ్లు పోసి పక్కన పెట్టాలి. ఇందుకోసం అర కప్పు ఆర్గానిక్ బ్రౌన్ రైస్ లేదా వైట్ రైస్ తీసుకొవచ్చు. సుమారు గంట, అరగంట తర్వాత బియ్యాన్ని వడకట్టి, గాలి చొరబడని సీసాలో బియ్యం నీటిని నిల్వ చేయండి. ఆ బియ్యం నీటిని రాత్రంతా అలాగే ఉంచాలి. దీన్ని స్ప్రే బాటిల్‌ లో పోసి, దానిలో ఒక టీస్పూన్ ఆముదంను కూడా కలపాలి.. ఇది జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది. ఈ మిశ్రమాన్ని తల మీద స్ప్రే చేసి, స్మూత్‌గా మసాజ్ చేసుకోవాలి. మంచి ఫలితాల కోసం రాత్రంతా అలాగే వదిలేయండి. ఆ మర్నాడు వాష్‌ చేసుకోవాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తూ ఉండటం వల్ల త్వరలోనే సిల్కీ, లాంగ్‌ హెయిర్‌ను పొందగలరు. మీకు ఏదైనా ఫలితం కనిపించాలంటే మీరు రెగ్యులర్‌గా దీన్ని అప్లై చేయాలి.

ఇవి కూడా చదవండి

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని TV9 Telugu.com (టీవీ9 తెలుగు) ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..