Relationship Tips: వైవాహిక జీవితంలో చేయకూడని తప్పులివే.. చేస్తే ఇక అంతే సంగతి..!

|

Apr 24, 2023 | 1:12 PM

Relationship Tips: ‘పెళ్లంటే నూరేళ్ల పంట’ అని మన పెద్దలు చెబుతుంటారు. అయితే ఇటీవలి కాలంలో కొందరు పెళ్లయిన 6 నెలలకే విడాకులు కావాలని అడుగుతున్నారు. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒక్కటైన వారి మధ్య బంధం బలహీన పడడమే ప్రధాన కారణం. పెద్దలు చూపించారని..

Relationship Tips: వైవాహిక జీవితంలో చేయకూడని తప్పులివే.. చేస్తే ఇక అంతే సంగతి..!
Relationship Tips
Follow us on

Relationship Tips: ‘పెళ్లంటే నూరేళ్ల పంట’ అని మన పెద్దలు చెబుతుంటారు. అయితే ఇటీవలి కాలంలో కొందరు పెళ్లయిన 6 నెలలకే విడాకులు కావాలని అడుగుతున్నారు. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒక్కటైన వారి మధ్య బంధం బలహీన పడడమే ప్రధాన కారణం. పెద్దలు చూపించారని లేదా మనసుకు నచ్చారని పెళ్లి చేసుకుంటున్నారు, కానీ జీవిత భాగస్వామితో ఎలా మసలుకోవాలో తెలుసుకోలేకపోతున్నారు. అలాంటివి తెలుసుకోకపోవడమే విడాకులకు ప్రధాన కారణంగా కూడా మారుతోంది. ఇంకా భాగస్వామి చేసిన తప్పులను ఎత్తి చూపడం, వాళ్లని మోసం చేయడం, వారిపై రాక్షస ప్రేమ చూపించడం వంటివి కూడా బంధాన్ని ప్రభావితం చేసే అంశాలే. అసలు మీ భాగస్వామితో మీ బంధం బలహీన పడకుండా, మీ దాంపత్య జీవితంలో సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని తప్పులను  అసలు చేయకూడదు, అవేమిటో ఇప్పుడు చూద్దాం..

మోసం చేయడం లేదా నిజాయితీగా ఉండకపోవడం: తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే. అలాంటి విషయాలను మీ భాగస్వామి వద్ద దాచకండి. మీరు ఎప్పుడైనా అనుకోకుండా చేసిన తప్పులను తన ముందు నిజాయితీగా చెప్పేయండి. ఇంకా మీ భాగస్వామికి చెప్పకుండా ఉంటే.. అది తెలిసిన రోజు మీరు తనని మోసం చేసారని భావించే అవకాశం ఉంది. కాబట్టి చేసింది చిన్న తప్పు, పెద్ద తప్పు అని చూడకుండా తన ముందు ఒప్పేసుకోండి.

అతిగా ఆశించడం: దాంపత్య జీవితం అంటేనే ఒకరి మీద ఒకరు తెలీకుండానే ఆధారపడటం. ఫలితంగా భాగస్వామి నుంచి ఆశించడం అనేది అలవాటుగా మారుతుంది. ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు ఏం చెప్పకుండానే అర్థం చేసుకుంటారని ఆశించడం కన్నా, ఏం కావాలో చెప్పి ఆడగడం మంచిది. అలాగే తనకు కూడా ఏం కావాలో అడుగుతూ ఉండడం మంచిది. అలా కాకుండా చెప్పకుండానే ఆశించినవి ఇస్తారని అతిగా ఆశిస్తే అసలకే మోసం వస్తుంది.. మీ బంధం బలహీనమవుతుంది.

ఇవి కూడా చదవండి

మితిమీరిన హద్దులు: మనం ఇచ్చుకునే చోరవ కారణంగానే ఎదుటివారికి మనపై ఓ అభిప్రాయం కలుగుతుంది. ఎలా అంటే కొందరికి ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవడం ఇష్టం ఉండదు. కొందరైతే ప్రతిదీ పంచుకోవాలనుకుంటారు. అలాంటి పరిస్థితులలో ఇద్దరూ కలిసి చర్చించుకుని ఒక అభిప్రాయానికి రావాలి. దానికి తగ్గట్టుగా డబ్బు, కుటుంబం, స్నేహితుల విషయాలలో కొన్ని రకాల నిర్ణయాలు తప్పనిసరి. అప్పుడే మీ బంధం బలహీన పడకుండా ఉంటుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్  వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..